ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. వరుసగా యంగ్ స్టార్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అక్కినేని ఇంట నాగచైతన్య తో పాటు అఖిల్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెపుతుండగా.. అటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పెళ్ళికి సిద్దం అవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్ళాడబోతుంది. ఇండస్ట్రీలో ఇలా ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కేస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరో, హీరోయిన్లు తమ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పి.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే హీరోయిన్ మేఘా ఆకాష్, హీరో శ్రీసింహా, కిరణ్ అబ్బవరం లాంటి యంగ్స్టార్స్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఈ ఏడాది. ఈ లిస్ట్ లోనే చేరబోతున్నాడు మరోయంగ్ హీరో.