Sobhita Dhulipala: సమంతకు పోటీగా గుడ్ న్యూస్ చెప్పిన నాగ చైతన్య, శోభిత జంట.. శుభాకాంక్షలు

Published : Dec 04, 2025, 04:46 PM IST

Sobhita Dhulipala: నటి సమంత రెండో పెళ్లి వార్తలు ఇంటర్నెట్‌ను ముంచెత్తుతున్న వేళ, ఇప్పుడు శోభితా ధూళిపాళ చెప్పిన గుడ్ న్యూస్ దాన్ని ఓవర్‌టేక్ చేసింది.

PREV
14
సమంత రెండో పెళ్లి వేళ శోభితా పోస్ట్ వైరల్‌

నటి సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి ఇటీవల కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జరిగింది. యోగ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి. సమంత ఈ ఫోటోలను పంచుకుంది. దీంతో గత మూడు నాలుగు రోజులుగా సమంత రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో తాజాగా నాగచైతన్య రెండో భార్య, నటి శోభితా దూళిపాళ్ల పెట్టిన పోస్ట్ హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

24
శోభితాకి చైతూ రియాక్షన్‌

'భూత శుద్ధి వివాహం' పద్ధతిలో సమంత పెళ్లి జరిగింది. ఈ వార్తలు వైరల్ అవుతున్న టైంలో, నాగ చైతన్య భార్య శోభిత పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు శోభితా పోస్ట్ కి నాగచైతన్య కూడా స్పందించారు. తన హ్యాపీనెస్‌ ని పంచుకున్నారు. 

34
శోభిత చెప్పిన గుడ్ న్యూస్

సమంతతో విడాకుల తర్వాత శోభితను ప్రేమించిన నాగ చైతన్య, గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. తమ మొదటి పెళ్లి రోజు సందర్భంగా శోభిత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. పెళ్లై ఏడాది పూర్తయిన సందర్భంగా ఇద్దరు ఆనందం వ్యక్తం చేశారు.

44
శోభిత పోస్ట్ వైరల్

పెళ్లి వీడియోను పోస్ట్ చేస్తూ, 'గాలి ఎప్పుడూ ఇంటికి వీస్తుంది. నేను భర్త అని పిలిచే వ్యక్తితో ఏడాది ఒక ట్రిప్పీ ట్రిప్‌  కొత్తగా ఫీల్ అవుతున్నా. అగ్ని ద్వారా శుద్ధి చేయబడినట్టుగా నా మిస్టర్‌తో ఏడాది' అని శోభిత ఎమోషనల్‌గా రాశారు. దీనికి నాగచైతన్య స్పందించారు. నీ జర్నీలో నేను భాగం కావడం ఆనందంగా ఉంది నా లవ్‌` అని పేర్కొన్నారు చైతూ. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories