డిసెంబర్ 4న రేణు దేశాయ్ తన 44వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ కెరీర్, తొలి చిత్రం బద్రి గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రేణు దేశాయ్ పుట్టినరోజు రేణు దేశాయ్, పవన్ విడిపోయి చాలా కాలం అవుతోంది. కానీ ఇప్పటికీ వీరిద్దరి గురించి అభిమానులు మాట్లాడుతూనే ఉంటారు. పవన్, రేణు దేశాయ్ లకు అకీరా, ఆద్య సంతానం. గురువారం డిసెంబర్ 4న రేణు దేశాయ్ తన 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
26
బద్రి మూవీ విశేషాలు
రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ బద్రి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనా ప్రస్థానం చాలా తక్కువే. బద్రి తర్వాత పవన్ కళ్యాణ్ తో జానీ మూవీలో నటించారు. తమిళంలో ఒక సినిమా చేశారు. ఆ తర్వాత రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించలేదు. బద్రితో పవన్ తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. దీనితో రేణు దేశాయ్ నటనకి గుడ్ బై చెప్పేశారు. ఇటీవల రవితేజ టైగర్ నాగేశ్వర రావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.
36
బద్రి నాకు జీవితాన్ని ఇచ్చింది
ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ బద్రి చిత్రానికి సంబంధించిన విశేషాలు గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాధ్ తో ఈ చిట్ చాట్ జరిగింది. బద్రి మూవీ నాకు జీవితాన్ని ఇచ్చిన చిత్రం. పూరి జగన్నాధ్ గారు నాకు దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ ఇష్టం అని రేణు దేశాయ్ తెలిపారు. అసలు పూరి జగన్నాధ్ గారు నాకు ఎందుకు ఛాన్స్ ఇచ్చారో తెలియదు. కనీసం ఆడిషన్ కూడా చేయలేదు అని రేణు దేశాయ్ తెలిపారు. దీనికి పూరి స్పందిస్తూ.. మీరు ఎంతో బ్యూటిఫుల్ రేణు గారు అని అన్నారు. నేను ఏం బ్యూటిఫుల్ గా ఉన్నాను అంటూ రేణు దేశాయ్ ఖండించింది.
అయితే ఈ సినిమా విషయంలో పూరి తనని చీటింగ్ కూడా చేశారు అని రేణు దేశాయ్ పేర్కొంది. బద్రి మూవీలో అమీషా పటేల్ పాత్రలో నేను నటించాల్సింది. కానీ చివరికి వెన్నెల పాత్ర ఇచ్చారు. దీనికి పూరి బదులిస్తూ.. అది నా తప్పు కాదు. అలా మార్చేసింది కళ్యాణ్ గారే. ఈ అమ్మాయి కళ్ళలో నాటీ నెస్ ఉంది. వెన్నెల పాత్రకి బాగా సరిపోతుంది అని మార్చేసినట్లు పూరి పేర్కొన్నారు.
56
వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది
మీ అందరికీ బద్రి మూవీ ఒక సినిమా మాత్రమే.. కానీ నాకు అది లైఫ్. ఆ చిత్రంతోనే కళ్యాణ్ గారితో పరిచయం, ప్రేమ, పెళ్లి జరిగాయి. ఇద్దరు అందమైన పిల్లలని పొందగలిగాను. నా కంటూ ఒక జీవితం ఏర్పడింది అని రేణు దేశాయ్ పేర్కొంది. ఇన్నేళ్ళలో చాలా జరిగాయి అని పూరి జగన్నాధ్ నవ్వుతూ.. పవన్, రేణు దేశాయ్ పర్సనల్ లైఫ్ గురించి పరోక్షంగా అన్నారు. వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది అంటూ రేణు దేశాయ్ తన ముఖాన్ని చేతులతో దాచేసుకుంది.
66
కళ్యాణ్ గారిని తొలిసారి కలిసింది అప్పుడే
కళ్యాణ్ గారిని తొలిసారి మీట్ అయిన సందర్భం తేదీతో సహా గుర్తుంది. మీరే(పూరి జగన్నాధ్) కళ్యాణ్ గారి దగ్గరికి నన్ను జూన్ 6, 1999న తీసుకువెళ్లారు. ఆయన రామానాయుడు స్టూడియోలో తమ్ముడు మూవీ షూటింగ్ లో ఉన్నారు. అప్పుడే తొలిసారి ఆయన్ని కలిశాను. బద్రి తర్వాత నేను చాలా సినిమాల్లో ఆఫర్ ఇచ్చాను. కానీ మీరే చేయలేదు అని పూరి అన్నారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ఆ టైంలో నేను కళ్యాణ్ గారితో ప్రేమలో ఉన్నాను.. నా భర్తతో ఉండాలనుకున్నాను. అది ఒక వేరే లైఫ్ అని రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.