అక్కినేని నాగ చైతన్య మరోసారి 'లాల్ సింగ్ చడ్డా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని వారాల క్రితం చైతు 'థాంక్యూ' చిత్రం విడుదలైంది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. కానీ చైతు లాల్ సింగ్ చెడ్డా కోసం దేశం మొత్తం తిరిగి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నాగ చైతన్య నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

26
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాగ చైతన్య తన పర్సనల్ లైఫ్ గురించి బాంబు లాంటి వార్త పేల్చాడు. సాధారణంగా నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితం గురించి మీడియా ముందు చర్చించడు. ఎక్కువగా హంగామా చేసే వ్యక్తిత్వం కూడా చైతూది కాదు.
36
కానీ ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన రొమాంటిక్ లైఫ్ గురించి రివీల్ చేశాడు. నాగ చైతన్యని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కారులో రొమాన్స్ గురించి ప్రస్తావించాడు.
46
నాగ చైతన్య వెంటనే.. అది నాకు కూడా జరిగింది. హైదరాబాద్ లో కారులో బ్యాక్ సీట్ లో కూర్చుని అమ్మాయికి ముద్దు పెడుతుండగా పోలీసులకు దొరికిపోయాం అని బాంబు పేల్చాడు. అప్పుడు భయం వేయలేదా అని ప్రశ్నించగా.. అదేం లేదు.. పోలీసులకు దొరికిపోయాం అంతే అని నవ్వుతూ బదులిచ్చాడు. నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది అందుకే భయం లేదు అని చైతూ బోల్డ్ గా సమాధానం ఇచ్చాడు.
56
ఆ అమ్మాయి ఎవరు, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని చైతు బయట పెట్టలేదు. బహుశా కాలేజ్ డేస్ లో అయి ఉంటుంది అని నెటిజన్లు భావిస్తున్నారు, నాగ చైతన్య తన పర్సనల్ లైఫ్ గురించి ఇంత బోల్డ్ గా ఓపెన్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు.
66
గత ఏడాది నాగ చైతన్య.. సమంత విడాకులు తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే చైతు తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ కావడం ప్రారంభించాడు. సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య త్వరలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించాల్సి ఉంది.