యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులుగా థియేటర్స్ సమస్య, కోవిడ్ కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.