టాలీవుడ్ కి మంచి రోజులొచ్చాయి. వరుస హిట్స్ తో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. ఆగస్టు నెలలో విడుదలైన చిన్న చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. జులై నెల పరిశ్రమకు పీడకలగా మారగా, ఆగస్టు గొప్ప ఉపశనమిచ్చింది. వరుస డిజాస్టర్స్ టాలీవుడ్ ని కలవరపెట్టాయి. ముఖ్యంగా జులై నెలలో విడుదలైన పక్కా కమర్షియల్, ది వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. కోట్ల రూపాయల నష్టాలు మిగిల్చిన ఈ చిత్రాలు మేకర్స్ లో కొత్త ఆందోళనకు బీజం వేశాయి.