ఒక రిలేషన్ షిప్‌ని బ్రేక్ చేయాలంటే దాని గురించి నేను వెయ్యి సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే దాని పరిణామాలు నాకు తెలుసు. నేను ఒక బ్రోకెన్(విడాకులు) ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ అనుభవం, ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆ విషయంలో నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. ఇది మేము ఇద్దరం(సమంత, తాను) కలిసి తీసుకున్న నిర్ణయం.
దురదృష్టవశాత్తు అదొక టాపిక్‌లాగా అయిపోయి, అదొక హెడ్‌లైన్‌గా అయిపోయి, అదొక గాసిప్‌లా, ఇప్పుడదొక ఎంటర్‌టైన్‌మెంట్‌లాగా అయిపోయింది. దాని గురించి నేను మాట్లాడితే, ఆ ఇంటర్వ్యూ నుంచైనా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. దీనికి ఫుల్‌స్టాప్ అనేది ఎక్కడుండి? రాసే వాళ్లే పుల్ స్టాప్ పెట్టాలి` అని తెలిపారు నాగచైతన్య. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.