పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. హీరోగా మాత్రమే కాదు..ఆయన మంచి రైటర్, కొరియోగ్రఫర్, డైరెక్టర్, సింగర్ కూడా. పవన్ డైరెక్షన్ లో వచ్చిన జాని సినిమా డిజాస్టర్ అయినా.. ఆ సినిమా కోసం పవన్ పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంతా కాదు. ఆసినిమాను ఆయన అద్భుతంగా డ్రైవ్ చేసి చూపించారు. అంతే కాదు గుడుంబ శంకర్ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా రాశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతే కాదు సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా ఆయన కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఇలా మల్టీ టాలెంట్ ఉన్న పవన్.. బన్నీతో ఓ మూవీ చేయాలి అనుకున్నారట.