నాగచైతన్య తల్లి లక్ష్మి రెండో భర్త గురించి మీకు తెలుసా? ఆయన ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు?

Published : Aug 06, 2025, 04:54 PM IST

ఇండస్ట్రీలో పెళ్లిల్లు విడాకులు కామన్, రెండో పెళ్లి కూడా సాధారణంగా చేసుకుంటూనే ఉంటారు. ఈక్రమంలో అక్కినేని నాగార్జున కూడా వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని పెళ్ళాడి విడాకులు తీసుకున్నారు. ఆతరువాత అమలను పెళ్లాడారు. మరిలక్ష్మి పెళ్లి చేసుకున్నది ఎవరిని?

PREV
15

అక్కినేని- దగ్గుబాటి కుటుంబాలు

టాలీవుడ్ లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కుటుంబాలలో ఇప్పటికే మూడు తరాల నటులు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతే కాదు ఈ రెండు సినిమా కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉండటం విశేషం. నాగార్జున మొదటి భార్య, నాగచైతన్య తల్లి లక్ష్మి, స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు కూతురు. నాగార్జున తో పెళ్లి, విడాకుల తరువాత ఆమె ఎవరిని రెండో పెళ్లి చేసుకుందో తెలుసా? నాగచైతన్య తల్లి లక్ష్మి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు? ఏం చేస్తారు? లక్ష్మి రెండో భర్త ఎవరన్న విషయం మీద చాలామందికి తెలియని ఆసక్తికర విషయం.

25

నాగార్జున - లక్ష్మి వివాహం, విడాకులు:

నాగార్జున 1984లో ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 1986లో నాగచైతన్య జన్మించారు. అయితే పెళ్లి అనంతరం కొంతకాలానికి మనస్పర్థల వల్ల 1990లో ఈ జంట విడాకులు తీసుకుంది. విడాకుల అనంతరం నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమించి, పెళ్లి చేసుకోగా, లక్ష్మి కూడా తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. మరో వ్యాక్తిని పెళ్లి చేసుకుని ఆమె ఫారెన్ లో సెటిల్ అయ్యారు.

35

లక్ష్మి రెండో భర్త ఎవరు?

నాగచైతన్య తల్లి లక్ష్మి రెండోసారి శరత్ విజయరాఘవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆయన పేరు చాలా మందికి తెలియకపోయినా, వ్యాపార రంగంలో అతను మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. శరత్ విజయరాఘవన్ ప్రస్తుతం శ్రీరామ్ మోటార్స్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. లక్ష్మి, శరత్ వివాహానంతరం అమెరికాలో స్థిరపడ్డారు. వారు అక్కడే కుటుంబంతో హ్యాపీగా ఉన్నారు. అంతే కాదు అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీస్ లో ఎటువంటి కార్యక్రమాలు జరిగిని, ఈవెంట్లు జరిగినా ఆమె తన ఫ్యామిలీతో సహా హాజరవుతుంటారు. నాగచైతన్య పెళ్లిలో కూడా ఆమె సందడి చేశారు.

45

తల్లితో నాగచైతన్యకు విభేదాలు?

నాగార్జునతో విడాకుల తీసుకుని లక్ష్మి వేరే పెళ్లి చేసుకున్న విషయంపై నాగచైతన్యకు అసంతృప్తి ఉందని, అందుకే తల్లికి దూరంగా ఉంటాడని అప్పట్లో ప్రచారం జరిగింది. కాని అందులో ఎటువంటి నిజం లేదని, అవన్నీ పుకార్లే అని కొన్ని సంఘటన ద్వారా రుజువు అయ్యింది. నాగచైతన్య ప్రతీ ఈవెంట్ లో తన తల్లి ఉన్నారు. అమ్మ చాాలాస్ట్రిక్ట్, నా స్కూలింగ్ అప్పుడు అమ్మ నాదగ్గరే ఉంది అని చైతూ ఓ సందర్భంలో అన్నారు.  చైతు సమంత పెళ్లిలో కూడా లక్ష్మీ తన ఫ్యామిలీతో సందడి చేశారు. అంతే కాదు నాగచైతన్య రీసెంట్ గా చేసుకున్న రెండో పెళ్లిలో కూడా ఆమె కనిపించారు. చైతూ నిశ్చితార్థం సమయంలో లక్ష్మి తన భర్త శరత్‌తో కలిసి వచ్చి కుమారుడిని ఆశీర్వదించారు. ఈ వేడుకలో శరత్-లక్ష్మి, నాగచైతన్య, అమల – అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటోలు లాస్ట్ ఇయర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగచైతన్య శోభిత పెళ్లికి కూడా ఆమె హాజరయ్యారు.

55

నాగచైతన్య పెళ్లి విడాకులు

అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్నార్ తప్పించి నాగార్జున, నాగచైతన్య, ఇద్దరు రెండు పెళ్లిల్లు చేసుకున్నవారే. అఖిల్ కూడా నిశ్చితార్దం చేసుకున్న ఓ పెళ్లికి బ్రేకప్ చెప్పారు. నాగచైతన్య మొదట హీరోయిన్ సమంతను 2017లో పెళ్లి చేసుకుని, 2021 మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. తర్వాత శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో పడిన ఆయన 2024 చివర్లో రెండోసారి వివాహం చేసుకున్నారు. అటు అఖిల్ కూడా అంతే మొదట వ్యాపారవేత్త మనవరాలు శ్రీయా భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్.. ఆతరువాత అది బ్రేకప్ అవ్వడంతో.. ఐదారేళ్లు గ్యాప్ తీసుకుని రీసెంట్ గా జైనాబ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories