`పుష్ప` ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి బన్నీ ప్లాన్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనే విడుదల చేస్తున్నారు. హిందీలో ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం లేదు. అక్కడ ప్రస్తుతం `పుష్ప` థియేటర్లో బాగా ఆడుతుంది. వంద కోట్ల లక్ష్యంగా దూసుకుపోతుంది. హిందీ మార్కెట్‌లో రికార్డ్ స్థాయిలో దాదాపు ఎనభై కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. తక్కువ ప్రమోషన్, `స్పైడర్ మ్యాన్` వంటి భారీ చిత్రం హవా సాగుతున్నా, బాలీవుడ్ చిత్రాలున్నా `పుష్ప` హిందీలో ఆ స్థాయిలో కలెక్షన్లని రాబట్టడం హిందీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కరణ్ జోహార్, తరణ్ ఆదర్శ్ లాంటి వారే ఆశ్చర్యం వక్తం చేస్తుండటం విశేషం.