ప్రస్తుతం జనరేషన్ లో టాటూస్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. స్టార్స్ నుంచి సామాన్యుల వరకూ చాలామంది టాటూస్తో కనిపిస్తున్నారు. ఇక ఏ హీరో అయిన టాటూ వేసుకున్నాడంటే.. ఇక అభిమానుల శరీరాలపై అదే టాటూ కనిపిస్తుంటుంది.
అయితే గతంలో దీన్నే పచ్చబొట్టు అని పిలిచేవారు. జ్ఞపకాలు పదిలంగా దాచుకోవడం కోసం ఇలా పచ్చ బొట్టు వేసుకునేవారు. ఇక వెనకటి నటీనటులలో ఈ ట్రెండ్ తక్కువే కాని.. పచ్చబొట్టు బేస్ చేసుకుని.. సినిమాలు, పాటులు చాలా వచ్చాయి.