Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య.. సమంతకు అదిరిపోయే షాక్!

Published : Dec 14, 2025, 05:32 PM IST

Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ మ్యారేజ్‌ చేసుకుని ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలో సమంతకి షాకిచ్చే వార్తని రెడీ చేశారట. త్వరలో గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారట. 

PREV
15
సమంతని మొదటి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య

నాగచైతన్య... కింగ్‌ నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. `జోష్‌` మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత `ఏం మాయ చేసావె` చిత్రంతో హిట్‌ కొట్టాడు. ఇక స్టార్‌ అయిపోయారు. ఈ మూవీలో సమంతో కలిసి ఆమె ప్రేమలో పడిన విషయం తెలిసిందే. 2017లో సమంతను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగా మానసిక వేదనతో జీవించింది. అనారోగ్యానికి కూడా గురయ్యింది. దాన్నుంచి వర్కౌట్‌ చేసి కోలుకుంది. ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్న ఆమె, ఇటీవల రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకుంది.

25
శోభితని రెండో పెళ్లి చేసుకున్న చైతూ

సమంత, నాగ చైతన్య 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న చైతూ గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. మరో నటి శోభితని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో మ్యారేజ్‌ జరిగింది. ఇటీవలే ఫస్ట్ యానివర్సరి చేసుకున్నారు. ఇటీవల గుడికి వెళ్లిన ఫోటోలను పంచుకున్నారు చైతూ శోభితా. తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

35
తల్లి కాబోతున్న శోభిత

శోభిత అటు హిందీ, ఇటు తెలుగు, మరోవైపు తమిళ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవల మణిరత్నం రూపొందించిన `పొన్నియిన్‌ సెల్వన్`లో నటించిన విషయం తెలిసిందే. ఇది ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చింది. అయితే చాలా కాలంగా నాగచైతన్య, శోభిత ప్రేమ లో పడ్డారు.  పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సంతోషంగా జీవిస్తున్న వీరికి సంబంధించిన ఓ వార్త ఆసక్తికరంగా మారింది.  శోభిత గర్భవతి అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో చైతూ తండ్రి కాబోతున్నాడట.  ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నారట. 

45
నాగచైతన్యకి షాకిచ్చిన సమంత

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సమంత, రాజ్ నిడిమోరు ఇటీవల పెళ్లి చేసుకున్నారు. సమంత రెండో పెళ్లి చేసుకోవడం నాగ చైతన్యకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. రాజ్ నిడిమోరుకు కూడా ఇది రెండో పెళ్లే. ఈ వార్త అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.  

55
సమంతకు షాక్‌ ఇవ్వబోతున్న చైతూ

ఈ నేపథ్యంలోనే సమంతకు షాక్‌ ఇచ్చేలా నాగ చైతన్య గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని అంటున్నారు. శోభితా ధూళిపాళ గర్భవతిగా ఉందని సమాచారం. త్వరలో తాను తండ్రి కాబోతున్న సంతోషకరమైన వార్తను నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించి సమంతకు షాక్ ఇవ్వనున్నాడని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories