అక్కినేని కొత్త కోడలు ఫిక్స్..చైతు, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం ?.. సమంతతో విడాకుల తర్వాత జరిగింది ఇదే

First Published | Aug 8, 2024, 6:51 AM IST

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ తమ రిలేషన్ ని అఫీషియల్ చేయబోతున్నారట. నేడే అంటే గురువారం ఆగష్టు 8న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరుగబోతున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చైతు కానీ, శోభిత కానీ ఈ రూమర్స్ ని స్పష్టంగా ఖండించలేదు. మీడియా ముందు స్పందించడానికి నిరాకరిస్తూ వచ్చారు. వీళ్ళిద్దరూ తమ బంధాన్ని అఫీషియల్ చేసేందుకు ముహూర్తం వచ్చేసినట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. 

అటు ఇండస్ట్రీలో, ఇటు మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం నాగ చైతన్య, శోభిత ధూళిపాళ తమ రిలేషన్ ని అఫీషియల్ చేయబోతున్నారట. నేడే అంటే గురువారం ఆగష్టు 8న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరుగబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యే ఈ ప్రైవేట్ ఈవెంట్ నాగ చైతన్య నివాసంలో జరగబోతోందట. 


నిశ్చితార్థం తర్వాత ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చైతు, శోభిత కూడా తమ రిలేషన్ ని అఫీషియల్గా సామజిక మాధ్యమాల్లో ప్రకటిస్తారు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

నాగ చైతన్య 2017లో సమంతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మూడేళ్ళ పాటు కొనసాగిన ఈ బంధం 2021లో బ్రేక్ పడింది. ఇద్దరూ విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం చైతు సింగిల్ గా ఉన్నాడు. శోభిత ధూళిపాల, చైతు ఇంతవరకు కలసి నటించలేదు. కానీ వీరిద్దరూ ముంబైలో ఓ ఈవెంట్ లో మీట్ అయ్యారట. ఆ విధంగా పరిచయం జరిగింది. 

ఆ తర్వాత ముంబైలో ఓ హోటల్ లో వీళ్ళిద్దరూ ప్రైవేట్ గా మీట్ అయినట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అదే విధంగా వీళ్ళిద్దరూ కలసి యూరప్ టూర్ వెళ్లారని కూడా ప్రచారం జరిగింది. ఒక రెస్టారెంట్ వీళ్ళిద్దరూ ఉన్న పిక్ వైరల్ గా మారింది. 

తమ రిలేషన్ గురించి చైతు, శోభిత హింట్స్ ఇస్తూనే వచ్చారు. చైతు పోస్ట్ చేసిన వెకేషన్ పిక్స్ వైరల్ అయ్యాయి. అదే ప్లేస్ లో తాను ఉన్నట్లు శోభిత కూడానా హింట్ ఇస్తూ కొన్ని పోస్ట్ లు చేసింది. ఏది ఏమైనా నాగ చైతన్య రెండవసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ న్యూస్ రాగానే సోషల్ మీడియాలో శోభిత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని వారి కొత్త కోడలు అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!