100 మందిని నరికితే మగధీర హిట్టా ?.. హరీష్ శంకర్ దిమ్మతిరిగే సమాధానం..

డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల సోషల్ మీడియాలో అయినా, మీడియా ముందు అయినా ఏ విషయంలోనూ తగ్గడం లేదు. తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల సోషల్ మీడియాలో అయినా, మీడియా ముందు అయినా ఏ విషయంలోనూ తగ్గడం లేదు. తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు. అవసరం అయితే వాదనలకు కూడా దిగుతున్నారు.  మిస్టర్ బచ్చన్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో హరీష్ శంకర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ మిస్టర్ బచ్చన్ చిత్ర విశేషాలు వివరిస్తున్నారు. అదే విధంగా చిత్ర పరిశ్రమ గురించి కూడా తన అభిప్రాయాలు చెబుతున్నారు. సినిమాల్లో హీరోలు చేసే యాక్షన్ గురించి ఇంటర్వ్యూలో చర్చ జరిగింది. హరీష్ శంకర్ మాట్లాడుతూ హీరో అంటే సామాన్య వ్యక్తిలాగా.. మీలాగా నా లాగా ఉంటే అతడు హీరో అవ్వడు. 


ప్రేక్షకుడు అన్ని సమస్యలు మరచిపోయి ఎంజాయ్ చేయడానికే సినిమాకి వస్తాడు. అలాంటప్పుడు తాను చేయలేని పనులు హీరో చేయాలి అని అనుకుంటాడు. తాను కొట్టలేని శక్తివంతుడిని హీరో కొట్టాలి అని ప్రేక్షకుడు భావిస్తాడు అని హరీష్ శంకర్ అన్నారు. యాంకర్ ప్రశ్నిస్తూ నిజమే కానీ ఇటీవల సినిమాల్లో నేలవిడిచి సాము చేసే యాక్షన్ సీన్స్ వస్తున్నాయి. వందమంది విలన్లు వస్తుంటారు.. 200 మంది వస్తుంటారు.. వారందరిని హీరో ఇరగదీసేస్తుంటాడు. అలాంటి సీన్లు సహజసిద్ధంగా ఎలా ఉంటాయి అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి హరీష్ శంకర్ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు. 

Magadheera

హరీష్ మాట్లాడుతూ.. మీ దృష్టిలో మగధీర చిత్రం హిట్టా.. హిట్ అయితే ఏ స్థాయి హిట్ అని ప్రశ్నించారు. యాంకర్ బిగ్ హిట్ అని అన్నారు. హరీష్ మాట్లాడుతూ అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ సినిమా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపు అని నరకడం మొదలు పెడితే.. లెక్కబెట్టుకుంటుంటారు. 

మేము నిజంగానే నేలవిడిచి సాము చేస్తే ఆడియన్స్ ఆ చిత్రాన్ని ఫ్లాప్ చేయాలి కదా. మగధీర చిత్రంలో ఆ సీన్ 100 మెన్ ఎపిసోడ్ అని పాపులర్ అయింది. సలార్ చిత్రంలో ప్రభాస్ ఎంతమందిని నరికాడు.. ఆ సినిమా హిట్ కాలేదా. నరకడం మీదనే ఏ దర్శకుడు కథ రాయడు. అందులో ఎమోషన్ ఉంటుంది. నరికితే సినిమా హిట్ అంటే మగధీర తర్వాత 10వేల మందిని నరికే సినిమా వచ్చి ఉండాలి. ఆడియన్స్ ఎంతమందిని నరికారు అనేది పట్టించుకోరు.. ఆ ఫైట్ కథకి ఎమోషన్ కి సరిపోయిందా అని మాత్రమే చూస్తారు అంటూ హరీష్ బదులిచ్చారు. 

Latest Videos

click me!