బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 .. ఈసారి దబిడి దిబిడే .. ఎప్పట్నించి అంటే?

First Published | Aug 7, 2024, 10:22 PM IST


  ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే షో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ షో ద్వారా ఆయన  లోని మరో టాలెంట్ ని బయట పెట్టారు. బాలయ్య హోస్టింగ్ ని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు.   
 

Balakrishna


నందమూరి బాలయ్య ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో ఎన్ బి కే 109 చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ అఖండ కు సీక్వెల్ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా .. త్వరలో ఆహాలో అన్ స్టాపబుల్ విత్ బాలయ్య సీజన్ 4 స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. 

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే షో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ షో ద్వారా ఆయన  లోని మరో టాలెంట్ ని బయట పెట్టారు. బాలయ్య హోస్టింగ్ ని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆయన సెలెబ్రెటీలతో ఇంటరాక్ట్ అయిన విధానం .. వాళ్లతో సీక్రెట్స్ చెప్పిస్తూ ఫన్ జెనరేట్ చేయడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ షో ద్వారా బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది.  ఇప్పటివరకు స్ట్రీమ్ అయిన మూడు సీజన్లు  మంచి వ్యూస్ తో టాప్ లో నిలిచాయి. 


కానీ గత మూడో సీజన్ మాత్రం లిమిటెడ్ ఎడిషన్ గానే ముగిసింది. దీంతో సీజన్ 4 పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ దసరా పండుగ కనుకగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 12వ తేదీన స్ట్రీమింగ్ తీసుకురావాలని భావిస్తున్నారట. ఇక ఈ అన్ స్టాపబుల్ సీజన్ 4 కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఆహా ఎనౌన్స్ చేయనుందట. 

గత సీజన్లతో పోలిస్తే ఈసారి అంతకుమించి ఎంటర్టైన్మెంట్ ఉండేలా సీజన్ 4 ని ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి బడా హీరోలు ఈ నాలుగో సీజన్ గెస్టులుగా రాబోతున్నారు అని సమాచారం. గత సీజన్లో కేవలం రెండు ఎపిసోడ్లు మాత్రమే స్ట్రీమింగ్ అయ్యాయి. 

ఈసారి ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఆహా సిద్ధం అవుతుందట. అక్టోబర్ లో స్టార్ట్ అయి డిసెంబర్ వరకు కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ బాలయ్య ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తుంది ఫుల్ కుష్ అవుతున్నారు. 

Latest Videos

click me!