ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురిచేసిన సంఘటన నాగ చైతన్య, సమంత విడాకులు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేని అంశం. విభేదాల కారణంగా ఎంతో వేదన నడుమ చైతు సమంత విడిపోయారు. దాదాపు దశాబ్దానికి పైగా పరిచయం వీళ్ళిద్దరిది. నాలుగేళ్లపాటు దంపతులుగా కాపురం చేశారు. ఏమైందో తెలియదు కానీ ఊహించని విధంగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.