Naga Chaitanya - Samantha: ఆ విషయంలో తనకు సమంతనే బెస్ట్ అంటున్న నాగచైతన్య

Published : Jan 25, 2022, 12:41 PM IST

టాలీవుడ్ లో నాగచైతన్య- సమంత(Naga Chaitanya-Samantha)ల విడాకలు విషయం ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నాలుగు నెలలు కావస్తున్నా.. ఆప్రకంపనలు ఇంకా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. డివోర్స్ తీసుకున్నా సరే.. ఇప్పటికీ తనకు బెస్ట్ పెయిర్ సమంతనే అనేసాడు చైతూ.

PREV
17
Naga Chaitanya - Samantha: ఆ విషయంలో తనకు సమంతనే బెస్ట్ అంటున్న నాగచైతన్య

నాగ‌చైత‌న్య‌, స‌మంత(Naga Chaitanya-Samantha)ల విడాకుల వ్య‌వ‌హారం ఎంత‌టి చ‌ర్చ‌కు దారి తీసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టాలీవుడ్  స్వీట్ క‌పుల్ విడిపోవ‌డాన్ని ఫ్యాన్స్ ఇంకా జీర్జించుకోలేకపోతున్నారు. ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడిపోయినా.. ఈజంటను ప్రేమించే వారు మాత్రం ఈ విషయాన్ని తట్టుకోలేకపోయారు. ఎవరి తరపున ఉండాలో కూడా అర్ధం కాక కన్ ఫ్యూజన్ లో పడ్డారు.

27

తాము ఇద్ద‌రం ఇష్ట‌పూర్వ‌కంగానే విడిపోతున్నాం అంటూ.. లాస్ట్ ఇయర్ అక్టోబ‌ర్ 2న ఈ జంట విడాకుల విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇక అప్పటి నుంచి ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించకుండా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. సినిమాల్లో బిజీ అయిపోయారు. బయట ఎక్కడా ఈ విషయం గురించి మట్లాడలేదు.

37

కాని సమంత(Samantha) మాత్రం సోషల్ మీడియా వేదికగా.. ఇన్ డైరెక్ట్ గా తన బాధను వెల్లగక్కుతూనే ఉంది.  ఈ బాధ నుంచి బయట పడటానికి ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. ఆద్యాత్మికత వైపు కూడా చూసింది. ప్ర్రెండ్స్ తో టూర్లు వేసింది. సినిమా షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీ అయ్యింది. ఇప్పుడిప్పుడే  ఈ విషయాన్నిమర్చి పోయి బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయింది సమంత(Samantha).

47

సమంత (Samantha)అయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో  పోస్ట్ లు పెట్టింది కాని చైతన్య మాత్రం ఒక్క‌సారి కూడా తమ విడాకుల విషయం గురించి రెండో సారి  రెస్పాండ్ కాలేదు. అయితే రీసెంట్ గా మాత్రం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య.. సమంత (Naga Chaitanya-Samantha) గురించి స్పందించారు.  సమంత గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు నాగచైతన్య.

57

ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతున నాగచైతన్య(Naga Chaitanya)కు ఓ ప్రశ్న ఎదురైయ్యింది. మీరు న‌టించిన సినిమాల్లోని హీరోయిన్స్‌ల‌లో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవ‌రితో కుదిరింద‌ని. ఈ  ప్ర‌శ్న‌కు త‌డ‌ముకోకుండా.. వెంట‌నే స‌మంత(Samantha)తోనే కుదిరింది అని చెప్పుకొచ్చాడు. చైతన్య. తాము విడాకులు తీసుకున్నా.. ఇప్పటికీ ఎప్పటికీ.. సమంతనే తనకు బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు చైతన్య(Naga Chaitanya).

67

ఈ స్టేట్ మెంట్ తో అందరూ షాక్ కు  గుర‌య్యారు. విడాకుల త‌ర్వాత కూడా త‌న బెస్ట్ పెయిర్ స‌మంతేన‌ని చెప్ప‌డంతో ఫ్యాన్స్ ఎమోష‌న్ అవుతున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచాయి.  ఏం మాయ చేశావే సినిమాతో మొద‌లైన చైతన్య-సామ్‌ల(Naga Chaitanya-Samantha)  జోడి.. ఆటోనగర్‌ సూర్య , మనం,మజిలి సినిమాల వరకూ సక్సెస్ ఫుల్ గా సాగింది. ముక్యంగా మజిలీ సినిమాలో భార్య భర్తలుగా వీరి పెర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

77

ఇక 2017 లో పెద్దలను ఒప్పించి ఘనంగ పెళ్ళి చేసుకున్న Naga Chaitanya-Samantha..నాలుగేళ్ళుకు పైగా అన్యోన్యంగా ఉన్నారు. టూర్లు.. వంటలూ అంటూ తమ పర్సనల్ వీడియోస్ ను కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ చాలా కాల సందడి చేశారు. ఆతరువాత ఇద్దరి ఆలోచనలో విభేదాలు తలెత్తి.. ఇద్దరి ఇష్టపూర్వకంగానే విడిపోతున్నట్టు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2న ప్రకటించారు నాగచైతన్య- సమంత.

Read more Photos on
click me!

Recommended Stories