కాగా, ఈ ఫొటో చూసిన పలువురు నెటిజన్లు షాక్ అవుతున్నారు. దక్ష ఇంతలా కౌంటర్ ఇస్తుందనుకోలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ ఫొటోను ‘పుష్ఫ’ మూవీలోని డైలాగ్స్, సీన్స్ ను జోడించి మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీమ్స్ తన దాకా చేరడంతో దక్ష ఆ మీమ్స్ అన్నింటినీ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.