Kalki 2898 AD
ప్రభాస్ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా గతేడాది విడుదలై భారీ విజయం సాధించింది. ఈ మూవీ 1200కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. నాగ్ అశ్విన్ ఈ మూవీని మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందించారు. మైథలాజికల్ అంశాలకు, సైన్స్ ఫిక్షన్ జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించారు. సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ చేశారు.
`కల్కి 2` సినిమాలో పాండవులు ఉండరని, ప్రస్తుతంంలో పాండవుల పాత్రలు కూడా కనిపించవు అని తెలిపారు. కాకపోతే కురుక్షేత్రానికి సంబంధించిన సీన్లు ఉంటాయని చెప్పారు. ఈ లెక్కన కురుక్షేత్రంలోని కర్ణుడి పాత్ర, అర్జునుడు, అశ్వత్థామ, కృష్ణుడి పాత్రలు ఉంటాయని చెప్పొచ్చు.
ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం రివీల్ చేశాడు నాగ్ అశ్విన్. కృష్ణుడి పాత్ర గురించి రియాక్ట్ అయ్యారు. ఆ పాత్రలో మహేష్ బాబు నటిస్తే అదిరిపోయేదని, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేవారని, సినిమా రెండు వేల కోట్లు వసూలు చేసేదన్నారు నాగ్ అశ్విన్.
ఇంకోవైపు `కల్కి 2`లో కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై ఆయన స్పందించారు. కల్కిగా కొత్త ఫేస్ ఉంటుందని వెల్లడించారు. నోటెడ్ వాళ్లు కాకుండా, సినిమాల్లో నటిస్తున్న వాళ్లు కాకుండా కొత్త యాక్టర్‌ని కల్కిగా చూపించబోతున్నట్టు తెలిపారు నాగ్ అశ్విన్.
ఇప్పటి వరకు కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారనే క్యూరియాసిటీ ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని రివీల్ చేశాడు నాగ్ అశ్విన్. అయితే ఆ యాక్టర్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని, ఆలోచిస్తున్నట్టు తెలిపారు దర్శకుడు.
Kalki 2898 AD
`కల్కి 2898 ఏడీ`లో క్లైమాక్స్ లో కమల్ హాసన్ పాత్రతో ముగించారు. సుప్రీం యాస్కిన్‌గా ఆయన సీరం చుక్క తన లోకి ఎక్కడంతో మామూలు మనిషి అవుతాడు యాస్కిన్. దీంతో ఆయన ఇక రంగంలోకి దిగబోతున్నట్టు చూపించారు.
దీపికా పదుకొనె తప్పించుకున్న నేపథ్యంలో ఆమెని పట్టుకుని మిగిలిన సీరం పొంది, ఆమెలో పెరుగుతున్న కల్కిని చంపేసేందుకు యాస్కిన్ బయలు దేరబోతున్నట్టు చూపించారు. ఈ క్రమంలో శ్రీశ్రీ రాసిన `భూ మార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా` అనే డైలాగ్ చెబుతాడు. యాస్కిన్ ఆ డైలాగ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.