మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ యువతతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. రాంచరణ్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా చిరు కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.
ఇక చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల కూడా కెరీర్ లో, లైఫ్ లో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.శ్రీజ తన పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రేమించి వివాహం చేసుకున్న శ్రీజ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.
Sreeja Konidela
ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ తో శ్రీజ రెండో వివాహం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా వేర్వేరుగా ఉంటున్నారు. శ్రీజకి ఇద్దరు పిల్లలు సంతానం. ప్రస్తుతం శ్రీజ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు.
Sreeja Konidela
కెరీర్ లో ముందుకెళ్లాలి కాబట్టి ఆమె తన స్నేహితురాలు స్వాతి నిమ్మగడ్డతో కలసి సీసా స్పేసేస్ సెంటర్ అనే స్కూల్ ని ప్రారంభించారు. చిన్న పిల్లల చదువుతో పాటు వారి ఫిట్నెస్ కోసం వైవిధ్యంగా దీనిని ప్రారంభించారు. సీసా స్పేసేస్ ని ప్రారంభించి ఏడాది గడుస్తోంది.
దీనిలోకి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా పార్ట్నర్ గా చేరారు. దీనితో శ్రీజ, సానియా మీర్జా, స్వాతి నిమ్మగడ్డ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. శ్రీజ మాట్లాడుతూ.. సానియా మీర్జా కూడా మాతో జాయిన్ కావడం సంతోషంగా ఉందని తెలిపారు. పిల్లలని తీసుకువచ్చే తల్లి దండ్రులు కూడా ఇక్కడ సమయం గడిపేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిని ఇంకా ముందుకు తీసుకుని వెళ్లాలనే ప్లాన్స్ ఉన్నాయి. అంతా బాగా జరిగితే ఇండియా మొత్తం సీసా సెంటర్స్ ని ప్రారంభిస్తాం అని శ్రీజ తెలిపారు.