బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జునకు గంగవ్వతో ప్రత్యేక అనుబంధం ఉంది. గంగవ్వ సొంత ఇల్లు కట్టుకోవడం కోసం నాగార్జున వ్యక్తిగతంగా కొంత డబ్బు ఇచ్చారు.
కాగా ఏప్రిల్ 2న విడుదల కానున్న వైల్డ్ డాగ్ మూవీ ప్రమోషన్స్ కోసం నాగార్జున గంగవ్వను రంగంలోకి దింపారు. ఆమెతో పాటు ప్రత్యేక ఇంటర్వ్యూలో నాగార్జున పాల్గొన్నారు. వైల్డ్ డాగ్ టీం గంగవ్వతో కలిసి ఫోటోలు దిగడం విశేషం.
ఇదే సమయంలో మెషిన్ గన్ పట్టుకొని ఫోటోలకు ఫోజిచ్చింది గంగవ్వ. వైల్డ్ డాగ్ ప్రొమోషన్స్ లో గంగవ్వ కనిపించడం , ఆ మూవీకి ఎంతో కొంత ప్రచారం తెచ్చిపెట్టింది.
నాగార్జున, నితిన్ లాంటి స్టార్స్ కూడా గంగవ్వ చేత తమ చిత్రాన్ని ప్రోమోట్ చేయించడం ఆమెకు ఎంత పాపులారిటీ ఉందో అర్థం అవుతుంది. గంగవ్వ పేరు జనాల్లోకి బాగా వెళ్లిపోగా, ఆమెతో ప్రమోషన్స్ కలిసి వస్తుందని భావిస్తున్నారు.
మరోవైపు గంగవ్వ ఏకంగా హెలికాప్టర్ రైడ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ మధ్య హెలికాప్టర్ ఎక్కి తన ఊరి పరిసరాలు, గుళ్ళు, పొలాలు ఆకాశం పైనుండి చూశారు గంగవ్వ.
ఇక గంగవ్వ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తూనే.. టీవీ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు. వెండితెరపై కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయని సమాచారం.