కామెడీ పంచ్ లతో పాటు గ్లామర్ తో వర్ష ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. లేడీ గెటప్స్ లో మగాళ్లను చూసి విసుగెత్తిన ఆడియన్స్ వర్ష అందాలకు మైమరచిపోతున్నాడు.
మంచి హైట్, రంగు... హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని ఫిజిక్ కలిగిన వర్ష జబర్ధస్త్ కి రావడం వింతే. ఆమె అందాలకు వెండితెరపై వెలిగిపోవాల్సిన అర్హత ఉంది. ఆ దిశగా వర్ష ప్రయత్నాలు చేస్తే బెటర్.
వెండితెర సంగతి ఎలా ఉన్నా... బుల్లితెరపై మాత్రం వర్షకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. జబర్ధస్త్ షోతో పాటు, అనేక బుల్లితెర కార్యక్రమాలు, స్పెషల్ షోస్ లో వర్ష కనిపిస్తుంది.
జబర్ధస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ లవర్ అనే రూమర్ ని వర్ష తెచ్చుకున్నారు. జబర్ధస్త్ తో పాటు చాలా కార్యక్రమాలలో వీరు జంటగా కనిపిస్తూ అలరిస్తున్నారు. ఆఫ్ స్కిట్స్ లో కూడా వీరు రొమాన్స్ చేస్తూ కనిపించడం విశేషం.
వర్ష కు ప్రమాదం అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ చేసిన వీడియో చూసి, ఇమ్మానియేల్ అర్థరాత్రి కాల్ చేసి ఎలా ఉన్నావ్ అని అడిగాడట.
అప్పుడే ఇమ్మానియేల్ నావాడు అని ఫిక్స్ అయ్యానని వర్ష అందరి ముందు చెప్పి షాక్ ఇచ్చింది.
ఆ విధంగా తక్కువ కాలంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వర్ష వరుస ఫొటో షూట్స్ తో దుమ్మురేపుతున్నారు.
తాజాగా రెడ్ చోళీ లెహంగా ధరించి, వెనుక నుండి నడుము అందాలు చూపిస్తూ కవ్వించింది అమ్మడు.
నాజూకైన నడుము షేపు, వీపు నునుపు చూపిస్తూ వర్ష ఇచ్చిన హాట్ ఫోజు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వర్ష లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి.