అల్లు అర్జున్, స్నేహారెడ్డిలకు కుమారుడు, కూతురు ఉన్నారు. వీరిలో కూతురు అర్హ చిన్నప్పటి నుంచే స్పెషల్ అని నిరూపించుకుంటుంది. అంతేకాదు అచ్చం బన్నీ తరహా చలాకీతో ఆకట్టుకుంటుంది.
ఇటీవల బర్త్ డే సందర్బంగా ఆమెపై తీసిన వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యింది. మెగా ఫ్యాన్స్‌ని, అల్లు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
తాజాగా డబ్ స్మాష్‌లు చేయడం స్టార్ట్ చేసింది అల్లు అర్హ. ఇప్పటికే చేసిన ఓ డబ్ స్మాష్‌ని అల్లు అర్జున్ సతీమని అల్లు అర్హ పంచుకోగా, అది విశేషంగా వైరల్ అవుతుంది.
ఇందులో మీ ఫేవరేట్ హీరోయిన్ పేరేంటి? అని అడగ్గా అర్హ స్పందిస్తూ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అని చెప్పింది. ఆమె స్పెల్లింగ్ చెప్పగా, కాదు కాదు.. అలియాభట్ అంటూ మాట మార్చింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇది ఆగస్ట్ 13న విడుదల కానుంది.
ఈ డబ్ స్మాష్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. ఇప్పటికే దీన్ని రెండు లక్షలకుపైగా మంది వీక్షించడం విశేషం.
అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ క్యూట్ ఫోటోలు సైతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. బన్నీ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.
అల్లు అర్హ క్యూట్ ఫోటోస్.
అల్లు అర్హ క్యూట్ ఫోటోస్.
అల్లు అర్హ క్యూట్ ఫోటోస్.