
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభాస్ కు కోట్లాది అభిమానులున్నారు. చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ గ్లోబల్ క్రేజ్ ను కొనసాగిస్తూ, ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. వాస్తవానికి బాహుబలితో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆ తరువాత సలార్ బ్లాక్ బాస్టర్ కావడం, ఆ తర్వాత వచ్చిన ‘కల్కి ’ సినిమా సన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏకంగా వెయ్యికోట్లకుపైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా లెవెల్ నే మార్చేశారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పలు సినిమాలతో బిజీబిజీ గా ఉన్నారు. వీటిలో ప్రతి సినిమాతో అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్ అందించబోతున్నారట. రీసెంట్ షెడ్యూల్ ప్రకారం.. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మరికొన్ని పెద్ద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. ప్రభాస్ క్రేజ్ పంచ్, యాక్షన్, స్టైల్, గ్లామర్‌తో కవర్ చేసిన ఈ వరుస సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకునేలా డిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన సినిమాల్లో బాలీవుడ్, యాక్టర్స్ ను తీసుకోబోతున్నారట. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, హను రాఘవపూడి ఫౌజీ , అలాగే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాల్లో ఇలాంటి ప్రయోగాలు చేయబోతున్నారట.
‘కల్కి 2898 ఏడి’లో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్ర ఎంత ప్రభావవంతంగా నిలిచిందో ప్రేక్షకులందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ను అంతకు ముందు ‘సైరా’లో చూశారు. అయితే.. కల్కిలో అమితాబ్ బచ్చన్ ను చూపించిన మ్యాగ్నిట్యూడ్ వేరే స్థాయిలో ఉంది. పాత్ర పట్ల అమితాబ్ చూపిన అంకితభావం, ప్రమోషన్స్‌లో పదేపదే గుర్తుచేయడం, ట్వీట్లు వేయడం, ఇంటర్వ్యూల్లో ప్రత్యేకంగా చెప్పడంతో నిర్మాత అశ్విని దత్, దర్శకుడు నాగ అశ్విన్, హీరో ప్రభాస్‌తో అమితాబ్ బచ్చన్ కు గట్టి బాండింగ్ ఏర్పరచింది. ఇప్పుడు కల్కి 2లో కూడా ఆయనకీ కమల్ హాసన్‌తో పాటు ప్రాధాన్యం మరింత పెరగబోతోందని సమాచారం.
ఇక ప్రభాస్ మరో పీరియాడిక్ మూవీ ఫౌజీ లో కూడా బచ్చన్ ఫ్యామిలీ ప్రభావం కనిపించబోతోందట. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను సంప్రదించినట్టు టాక్. దర్శకుడు హను రాఘవపూడి ప్రత్యేకంగా ఈ పాత్రను డిజైన్ చేశారని, ‘సీతా రామం’లో సుమంత్ పోషించిన పాత్ర తరహాలో గుర్తుండిపోయే రోల్ తరహాలో ఓ కీలక పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం. ప్రభాస్ లవ్ స్టోరీని మలుపు తిప్పే ఈ రోల్‌లో పలు ఆప్షన్లు పరిశీలించిన తర్వాత, అభిషేక్ బచ్చన్ అయితేనే న్యాయం చేస్తారని యూనిట్ భావించిందట. ప్రస్తుతం రెండు వైపులా చర్చలు జరగగా, జూనియర్ బిగ్ బి నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయని టాక్. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుంట.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా బ్రిటిష్ కాలం, స్వాతంత్ర్య సమరం బ్యాక్‌డ్రాప్ లో కొనసాగుతుంది. ‘సీతా రామం’లో ఉన్న కవితాత్మకమైన ప్రేమకథను మరో స్థాయికి తీసుకెళ్లేలా, ఇంటెన్స్ లవ్ స్టోరీగా స్క్రీన్‌పైకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు చూడని ఒక కొత్త షేడ్‌లో కనిపించనున్నారని టాక్. క్లాసికల్ పీరియడ్ సెట్టింగ్‌లో ప్రభాస్ రోల్ ఇంటెన్స్, ఎమోషనల్ గా ఉంటుందని యూనిట్ క్లూ ఇచ్చింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘ది రాజా సాబ్’ జనవరిలో విడుదలైన తర్వాత, ప్రభాస్ తదుపరి రిలీజ్ ఫౌజీ అవ్వొచ్చని సమాచారం. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. 2026 దసరా లేదా దీపావళి రిలీజ్ లక్ష్యంగా మిగిలిన షెడ్యూల్ ప్లాన్ చేశారని ఇన్‌సైడ్ టాక్.