బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ విన్నర్‌గా సామాన్యుడు కళ్యాణ్ పడాల నిలిచారు. ఆయన మొదటిసారి ఓపెన్ అయ్యాడు. నెక్ట్స్ ఏం చేయబోతున్నాడో వెళ్లడించారు. ఇక వేరే లెవల్‌లో ప్లాన్ చేసుకుంటున్నాడట.
బిగ్ బాస్ ట్రోఫీ సాధించిన రెండో కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల నిలిచిన విషయం తెలిసిందే. కామన్ మ్యాన్‌గా హౌజ్‌లోకి వచ్చి ఏకంగా టైటిల్ విన్నర్‌గా నిలిచారు. సైలెంట్‌గా వచ్చి కప్ కొట్టుకుపోయాడు కళ్యాణ్. కామన్ మ్యాన్ కేటగిరిలో బిగ్ బాస్ ట్రోఫీ సాధించిన రెండో కంటెస్టెంట్ గా కళ్యాణ్ రికార్డ్ సృష్టించారు. గతంలో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
25
బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ తర్వాత మొదటిసారి కళ్యాణ్ రియాక్షన్
ఇక మొదటిసారి కళ్యాణ్ పడాల స్పందించారు. బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఫస్ట్ టైమ్ ఆయన ఓపెన్ అయ్యాడు. తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇదంతా బిగ్ బాస్ బజ్‌లో కావడం విశేషం. శివాజీ హోస్ట్ గా నిర్వహిస్తోన్న బిగ్ బాస్ బజ్‌లో కళ్యాణ్ మాట్లాడాడు. ఇందులో మొదటగా శివాజీ విన్నర్ కళ్యాణ్‌ని అభినందించాడు. `తనని తాను చెక్కుకున్న శిల్పివి నువ్వు` అంటూ ప్రశంసలు కురిపించారు. నీ గేమ్‌ని ఛేంజ్‌ని చేసింది దివ్య అంటే ఒప్పుకుంటావా? అని అడిగాడు శివాజీ, దానికి కళ్యాణ్ ఒప్పుకున్నాడు.
35
కళ్యాణ్ పడాల నెక్ట్స్ ప్లాన్ ఇదే
ఇక మీ ఫ్రెండ్ డీమాన్ పవన్ 15 లక్షలతో వెళ్లిపోవడం గురించి ప్రశ్నించగా, వాడూ మిడిల్ క్లాసే కదా, ఏం ఫీలింగ్ లేదని చెప్పాడు కళ్యాణ్. ఈ సందర్భంగా నెక్ట్స్ ఏం చేయబోతున్నావనేది ఓపెన్ అయ్యాడు కళ్యాణ్. తాను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడట. తాను స్టార్, హీరో అనేది కాకుండా గొప్ప నటుడిగా రాణించాలని, మంచి పేరు తెచ్చుకోవాలనేదే తన లక్ష్యమని తెలిపారు కళ్యాణ్. మొత్తంగా ఇక పూర్తిగా ఆర్మీని వదిలేసి సినిమాల్లోకి రాబోతున్నాడని చెప్పొచ్చు.
`నాలుగు నెలలకు ముందు నేను ఎవరినో ఎవరికీ తెలియదు. కనీసం మా ఊర్లో కూడా తెలియదు. అలాంటి నాకు ఈ అవకాశం ఇచ్చి, అగ్నిపరీక్ష నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది సపోర్ట్ చేశారు. ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌ని నిలిపారు. వారందరికి తాను రుణపడి ఉంటాన`ని తెలిపారు కళ్యాణ్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ రావాల్సి ఉంది. ఏదేమైనా నెక్ట్స్ కళ్యాణ్ పడాల సినిమాల్లోకి రాబోతున్నారని చెప్పొచ్చు. అయితే గతంలో విన్నర్‌గా నిలిచిన వాళ్లు ఒకటి రెండు సినిమాలు చేసి మెప్పించారు, కానీ సక్సెస్ కాలేకపోయారు మరీ కళ్యాణ్ ఎంత వరకు సక్సెస్ అవుతాడనేది చూడాలి.
55
బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన షాకిచ్చిన కళ్యాణ్
నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభమైన విషయం తెలిసింది. మొదటి 15 కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభమైంది. ఆ తర్వాత ఏడుగురు కంటెస్టెంట్ల మధ్యలో ఎంట్రీ ఇచ్చారు. ఇలా మొత్తం 22 మంది కంటెస్టెంట్లతో షోని రన్ చేశారు. చివరికి కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజనా టాప్ 5లోకి వచ్చారు. 105 రోజులు విజయవంతంగా ముగిసిన అనంతరం ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి క్రమంగా బలంగా నిలిచి ఏకంగా ట్రోఫీని దక్కించుకుని తోటి కంటెస్టెంట్లతోపాటు చాలా మందికి పెద్ద షాక్ ఇచ్చారు.