బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో శ్రీలీల మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఇందులో బాలకృష్ణ కూతురిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఇలా వరుస డిజాస్టర్స్ ఎదురవడంతో శ్రీలీల కెరీర్ కాస్త స్లో అయింది. గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. 2024లో గుంటూరు కారం తర్వాత ఆమె నుంచి మరో సినిమా రాలేదు.