మహేష్ బాబు 'సర్కారు వారి పాట'కి నేషనల్ అవార్డు మిస్సయిందా ?

First Published | Aug 17, 2024, 2:29 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ ఏమీ కాలేదు. మహేష్ అభిమానులు కూడా ఈ చిత్రంతో సంతృప్తి చెందలేదు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ ఏమీ కాలేదు. మహేష్ అభిమానులు కూడా ఈ చిత్రంతో సంతృప్తి చెందలేదు. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ ఒపీనియన్స్ వెలువడ్డాయి. 

అయితే ఈ చిత్రమే జాతీయ అవార్డులకు నామినేట్ అయింది. కానీ అవార్డు గెలుచుకోలేకపోయింది. కొద్దిలో సర్కారు వారి పాట చిత్రానికి నేషనల్ అవార్డు మిస్ అయిందని వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రాన్ని బ్యాంకింగ్ సెక్టార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. 


ఇండియాలో బ్యాంకింగ్ రంగం అనేది ప్రజలకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో సందేశాత్మకంగా పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ కుటుంబాలని బ్యాంకింగ్ వ్యవస్థలోని కొందరు ఎలా వేధిస్తున్నారు అనే అంశాలని ఈ చిత్రంలో చూపించారు. 

ఈ మూవీలో సందేశం నేషనల్ అవార్డు జ్యూరీ మెంబర్స్ కి నచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల అవార్డు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. లేకుంటే సర్కారు వారి పాటకి జాతీయ అవార్డు దక్కేది. సీతారామం చిత్రం కూడా జాతీయ అవార్డు మిస్ చేసుకుంది. 

Latest Videos

click me!