చిరంజీవికి కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నీ మొహానికి హీరో అవుదామని వచ్చావా... అని చెన్నై పాండి బజార్ లోని ఓ దుకాణం వాడు అన్నాడట. ఆ మాటలు చిరంజీవిని బాధించాయట. ఓ నిర్మాత అందరి ముందు.. నువ్వేమైనా స్టార్ అనుకున్నావా? నిన్ను ప్రత్యేకంగా పిలవాలా, ఇక్కడ ఉండొచ్చు కదా.. అని సెట్స్ లో గట్టిగా అరిచాడట. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి పడ్డ కష్టాలు, అవమానాలు చాలా ఉన్నాయి.
1978లో విడుదలైన ప్రాణం ఖరీదు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన చిరంజీవి... 80ల నాటికి స్టార్ హీరో అయ్యాడు. తిరుగులేని స్టార్డం తెచ్చుకున్నాడు. చిరంజీవి సినిమా అంటే థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యేవి. మాస్ ఆడియన్స్ లో ఆయనకు ఎక్కడ లేని ఫేమ్, ఫాలోయింగ్ వచ్చి పడింది. చిరంజీవి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు, బిరుదులు, సంపద, కీర్తి.. అన్నీ వచ్చాయి.