వెంకీ, అనీల్ రావిపూడి చిత్రానికి మూడు ఇంట్రస్టింగ్ టైటిల్స్

First Published | Oct 29, 2024, 11:34 AM IST

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడో చిత్రం డబ్బింగ్ పనులు ప్రారంభించుకుంది. చిత్రానికి మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి, సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం టైటిల్ త్వరలోనే వెల్లడి కానుంది.

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju


వెంకటేశ్‌ హీరోగా స్టార్ డైరక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు, శిరీశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’ సినిమాల తర్వాత ఈ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. రాజేంద్రప్రసాద్, సాయికుమార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju


షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఇప్పుడు డబ్బింగ్‌ పనుల్ని ప్రారంభించుకుంది.  ఇప్పటికే చిత్రీకరణ 90శాతం పూర్తయిందని.. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. త్వరలోనే టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ముక్కోణపు క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఇది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్ ఏమిటనే చర్చ మొదలైంది. 


#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం కోసం మూడు టైటిల్స్ రిజిస్టర్ చేసారని, వాటిలో ఒకటి ఫైనలైజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ టైటిల్స్ ఏమిటనేవిచూస్తే... అయితే ఈ సినిమాకు `సంక్రాంతికి వస్తున్నాం`,  ఇంట్లో ఇల్లాలు పోలీస్ స్టేషన్ లో ప్రియురాలు, ఇక్కడ ఇల్లాలు అక్కడ ప్రియరాలు అనే మూడు టైటిల్స్ ని రిజిస్టర్ చేసారు.

 అయితే ఇప్పటిదాకా `సంక్రాంతికి వస్తున్నాం`, అనే టైటిల్ కే కనెక్ట్ అయ్యారట. కానీ కథ ప్రకారం మిగతా రెండు టైటిల్స్ ని  పరిశీలిస్తున్నారట. ఇందులో భాగంగానే అనిల్‌-వెంకీ మూవీ కోసం సంక్రాంతికి వచ్చేస్తున్నారనే ప్రచారం జోరుగా జ‌రుగుతోంది.
 

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju

ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉన్నట్లు వార్తలు వినిపించిన.. సినిమా టైటిల్ ఖరారు కాకపోవడంతో పలువురు సంక్రాంతి రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ వార్తలకు చెక్ పెట్టింది నిర్మాణ సంస్థ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90% పూర్తయిందని తెలిపింది.

తాజాగా టీమ్ డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన డిలైట్ ఫుల్ వీడియో వేడుక వాతావరణాన్ని చూపిస్తోంది, వెంకటేష్‌ని అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్, కుటుంబంతో పాటు అందరూ ఉత్సాహంగా కనిపించారు. వెంకటేష్ చరిష్మా, రావిపూడి హ్యుమర్‌తో ఈ మూవీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju


దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ ఎక్స్‌గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. వెంకటేష్, మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి తదితరులు నటించారు.

Latest Videos

click me!