Soundarya: ఎంత స్టార్ అయినా సౌందర్య కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆ హీరో చేసిన పనిని పబ్లిక్ గా బయటపెట్టాం

Published : Jun 09, 2026, 07:26 AM IST

సౌందర్యతో ఒక ఇబ్బందికర సన్నివేశంలో నటించేందుకు స్టార్ హీరో అంగీకరించరు అని అంతా అనుకున్నారు. కానీ ఆ హీరో మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు అని డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య తెలిపారు. 

PREV
15
Soundarya

ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలతో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య తెలుగు ఆడియన్స్ లో బలమైన ముద్ర వేశారు. వెంకటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలతో ముత్యాల సుబ్బయ్య బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు. సౌందర్యతో ముత్యాల సుబ్బయ్య ఎక్కువ సినిమాలు చేశారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సౌందర్య పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, అన్నయ్య, సూర్యుడు లాంటి చిత్రాల్లో నటించింది.

25
పవిత్ర బంధం మూవీ

ముత్యాల సుబ్బయ్య, వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో తెరకెక్కిన పవిత్రబంధం చిత్రం చాలా ఊహించని పరిణామాల మధ్య జరిగిందట. నిర్మాతలకు ముందుగా ఈ కథ నచ్చలేదట. భూపతి రాజా ఈ చిత్రానికి కథ అందించారు. ముందు భూపతి రాజాకి అడ్వాన్స్ ఇచ్చి కథని తీసుకోండి. ఆ కథని మేము డెవలప్ చేస్తాం. అప్పుడు విని ఎలా ఉందో చెప్పండి అని నిర్మాతలకు తాను చెప్పినట్లు ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు.

35
వెంకటేష్ కాకపోతే ఇంకొకరు

కథని కంప్లీట్ చేశాం. నిర్మాతలకు నచ్చింది. కథ కంప్లీట్ కాగానే హీరోయిన్ గా సౌందర్య మాత్రమే నటించాలి అని ఫిక్స్ అయ్యాం. సౌందర్య కాళ్ళు పట్టుకునే సన్నివేశం ఈ మూవీలో ఉంటుంది. ఆమె కాళ్ళు పట్టుకోవడానికి వెంకటేష్ లాంటి పెద్ద హీరో ఎందుకు ఒప్పుకుంటారు అని నిర్మాతలు అన్నారు. వెంకటేష్ ఒప్పుకోకపోతే శ్రీకాంత్ తో చేద్దాం అని చెప్పాను. వెంకటేష్ ఎలాగూ ఒప్పుకోరు. సౌందర్య కాళ్ళు పట్టుకోవాలి. పైగా హీరోని హీరోయిన్ డామినేట్ చేసే సీన్లు చాలా ఉన్నాయి అని అనుకుంటూ వెంకటేష్ బాబుకి కథ చెప్పాం. ఏమీ మాట్లాడకుండా ఆయన ఓకె చెప్పారు. అంతే కాదు పవిత్ర బంధంలో వెంకటేష్ సౌందర్య కాళ్ళు పట్టుకునే సీన్ పోస్టర్ ని పబ్లిక్ గా రిలీజ్ చేసి పబ్లిసిటీ చేసినట్లు ముత్యాల సుబ్బయ్య తెలిపారు. దేనికి కూడా వెంకటేష్ బాబు అడ్డు చెప్పలేదు అని అన్నారు.

45
ఎవ్వరూ అడ్డు చెప్పలేదు

సురేష్ బాబు, రామానాయుడు కూడా కథ విని అద్భుతంగా ఉంది అని అన్నారు. ఆ విధంగా పవిత్రబంధం చిత్రం తెరకెక్కింది అని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు. పవిత్రబంధం తర్వాత వెంటనే వెంకటేష్ బాబు పెళ్లి చేసుకుందాం చిత్రానికి డేట్లు ఇచ్చారు.

55
ఒక్క బ్యాడ్ సీన్ కూడా లేదు

సౌందర్య నా దర్శకత్వంలో 5 సినిమాల్లో నటించింది. సావిత్రి, వాణిశ్రీ తర్వాత సౌందర్య పేరే చెబుతారు అందరూ. ఆమెతో 5 సినిమాలు చేసినప్పటికీ ఒక్క బ్యాడ్ సీన్ కూడా చేయలేదు. సౌందర్య లాంటి హీరోయిన్ నటిస్తున్నప్పుడు పాత్ర మాత్రమే కనిపించాలి అని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories