స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తన కష్టానికి తగ్గ ఫలితం దక్కని సినిమాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో పవన్, నాగార్జున సినిమాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా చరిత్రలో ఎందరో గొప్ప సంగీత దర్శకులు ఉన్నారు. వారిలో స్వరబ్రహ్మ గా గుర్తింపు పొందిన మణిశర్మ కూడా ఉంటారు. 90వ దశకం చివరి నుంచి ఆ తర్వాత పదేళ్ల పాటు మణిశర్మ తన సంగీతంతో సినీ ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. సంగీతంలో మణిశర్మ కొత్త ఒరవడి సృష్టించారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలయ్య లాంటి టాప్ హీరోలకు ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ మారారు.
25
'చూడాలని ఉంది'తో గుర్తింపు
మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, అశ్వినీదత్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో చిత్రంతో నేను ఇండస్ట్రీకి పరిచయం కావాల్సింది. కానీ ఆ మూవీ ఆగిపోయింది. కానీ అదే హీరో, అదే నిర్మాత కాంబినేషన్ లో వచ్చిన చూడాలని ఉందితో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాను. ఆ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. అంతకు ముందు కొన్ని చిత్రాలకు బ్యాగ్రౌండ్ స్కోర్, ఒకటి రెండు పాటలు చేసేవాడిని. పూర్తి స్థాయిలో సంగీత దర్శకుడిగా మారింది మాత్రం చూడాలని ఉందితోనే అని మణిశర్మ అన్నారు.
35
నా కష్టానికి తగ్గ ఫలితం
చూడాలని ఉందితో నాకు అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఆ తర్వాత సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాలు నా స్థాయిని పెంచాయి. ఈ చిత్రాలన్నీ నా కష్టానికి తగ్గ ఫలితాన్ని, గుర్తింపుని ఇచ్చాయి. నా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వని చిత్రాలు చాలా ఉన్నాయి అని మణిశర్మ అన్నారు.
నేను ఎంత కష్టపడినా ఫలితం దక్కని సినిమాల గురించి స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే.. నాగార్జున గారితో రావోయి చందమామ, పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లాంటి చిత్రాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో అద్భుతమైన మ్యూజిక్ ఉంటుంది. కానీ అవి హిట్ కాలేదు అని మణిశర్మ అన్నారు.
55
దళపతి విజయ్ ఆ రెండు పాటలే కావాలన్నాడు
దళపతి విజయ్ నటించిన షాజహాన్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అన్నయ్య సినిమాలో ఆటకావాలా పాటకావాలా అనే సాంగ్ ని, ఖుషి మూవీలోని అమ్మాయే సన్నగా అనే సాంగ్ ని విజయ్ అడిగి మరీ షాజహాన్ మూవీలో పెట్టించుకున్నారట. నేను వేరే సాంగ్స్ చేస్తాను అని మణిశర్మ చెప్పినప్పటికీ.. లేదు నాకు ఆ రెండు పాటలు కావాల్సిందే అని విజయ్ పట్టుబట్టినట్లు మణిశర్మ తెలిపారు.