కొత్తగా వచ్చే లేడీ సింగర్లపై మ్యూజిక్‌ డైరెక్టర్ల వేధింపులు.. నిజాలు ఒప్పుకున్న కీరవాణి

Published : Apr 28, 2025, 01:39 PM IST

ఇటీవల లేడీ సింగర్‌ ప్రవస్తి పాడుతా తీయగా సింగింగ్‌ షోలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, సింగర్‌ సునీత, చంద్రబోస్‌ తనకి అన్యాయం చేశారని, తన తప్పు లేకుండానే ఎలిమినేట్‌ చేశారని ఆమె ఆరోపించింది. ఇది ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అయ్యింది. దీనికి సింగర్‌ సునీతతోపాటు కొందరు సింగర్లు కౌంటర్లు ఇచ్చారు. అదే సమయంలో `పాడుతా తీయగా` ప్రోగ్రామ్‌ నిర్వహకులు కూడా వివరణ ఇచ్చారు.   

PREV
15
కొత్తగా వచ్చే లేడీ సింగర్లపై మ్యూజిక్‌ డైరెక్టర్ల వేధింపులు.. నిజాలు ఒప్పుకున్న కీరవాణి
M M Keeravani

సింగర్‌ ప్రవస్తి `పాడుతా తీయగా` షోపై చేసిన కామెంట్లు చిత్ర పరిశ్రమలో వివాదాస్పదమయ్యాయి. మ్యూజిక్‌ రంగంలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఆమెని విమర్శించారు.

మరికొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. సింగర్‌ సునీతపై బాగా ట్రోలింగ్‌ జరిగింది. కీరవాణిపై కూడా కొందరు విమర్శలు చేశారు. ఇదంతా పెద్ద ఇష్యూ అయ్యింది. దీన్నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మరిచిపోతున్నారు. 

25
keeravani

కానీ దాని తాలుకూ చర్చ అడపాదడపా నడుస్తూనే ఉంది. ఈ సందర్భంగా ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి మ్యూజిక్‌ రంగంలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించారు. అన్ని రంగంలో ఉన్నట్టుగానే సినిమా రంగంలోనూ అది ఉందని, లేదని తాను చెప్పడం లేదన్నారు.

`సినిమా వాళ్లకి పేరుంటుంది, గ్లామరస్‌గా మెరుస్తుంటారు. ఈ రంగంలో జరిగిన తప్పులు బయటకు వచ్చినట్టుగా మిగిలిన రంగాల్లో జరిగే తప్పులు బయటకు రావు. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది సమాజంలో ఉన్న చాలా రుగ్మతల్లో ఒక రుగ్మత ఇది కూడా. అది ఇండస్ట్రీలో కూడా ఉంది. దాన్ని ప్రత్యేకంగా చూడక్కర్లేదు. 

35
keeravani

అయితే కొన్ని సినిమాల్లో మ్యూజిక్‌ డైరెక్టర్లు సింగర్ల విషయంలో ఇలా చేసిన సన్నివేశాలు పెట్టడం వల్ల ఇలాంటి టాక్‌ ఇంకా ఎక్కువగా వినిపిస్తుంద`న్నారు కీరవాణి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అని అన్నారు. అయితే కేవలం దొరికితే దొంగ అనేదే కాదు, అలాంటి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా అతను దొంగనే.

కానీ ఆ విషయాలు బయటకు రావు, నిజం చెప్పాలంటే అది కూడా తప్పే అని తెలిపారు కీరవాణి. ఈ లెక్కలు తీస్తే దేశంలో ఇలాంటి చెడు ఆలోచనలు లేని వాళ్లు ఒక పది మంది కూడా ఉంటారా? అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే మ్యూజిక్‌ రంగంలోనూ ఉందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో వెల్లడించారు..  

45
keeravani

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాతో `నాటు నాటు` పాటకిగానూ చంద్రబోస్‌తో కలిసి ఆస్కార్‌ అవార్డుని అందుకున్నారు కీరవాణి. ఇండియన్‌ సినిమాకి మొదటిసారి ఆస్కార్‌ని తీసుకొచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇందులో `నాటు నాటు`కి పాటకి చరణ్‌, తారక్‌ వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. ప్రపంచం మొత్తం దాన్ని ఫాలో అయిన విషయం తెలిసిందే. 
 

55
rajamouli, keeravani

ఇక ప్రస్తుతం కీరవాణి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే రాజమౌళి, మహేష్‌ల చిత్రం `ఎస్‌ఎస్‌ఎంబీ29`కి సంగీతం అందిస్తున్నారు. ఈ రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి. 

read  more: సమంత లైఫ్‌ని మార్చేసిన టాప్‌ 10 సినిమాలు, ఆ ఒక్క హీరోతోనే మూడు బ్లాక్‌ బస్టర్స్

also read: రాజమౌళి సంచలన మూవీలో నాని, అఫీషియల్‌గా కన్ఫమ్‌ చేసిన జక్కన్న

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories