Krishna Mukunda Murari: ముకుందని పుట్టింటికి పంపివ్వనున్న మురారి.. ఎటు తేల్చుకోలేకపోతున్న కృష్ణ?

Published : May 24, 2023, 03:21 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తను ప్రేమించిన అమ్మాయి పెళ్లైనప్పటికీ తన వెంట పడుతుండటంతో ఇబ్బంది పడుతున్న ఒక ప్రేమికుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Krishna Mukunda Murari: ముకుందని పుట్టింటికి పంపివ్వనున్న మురారి.. ఎటు తేల్చుకోలేకపోతున్న కృష్ణ?

 ఎపిసోడ్ ప్రారంభంలో జాగింగ్ కి వెళ్లిన మురారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ముకుంద. ఇంతలోనే ఇంటికి వచ్చిన మురారి కి టవలు వాటర్ బాటిల్ ఇవ్వబోతుంది. కానీ అంతలోనే కృష్ణ వచ్చి మురారి కి టవల్, వాటర్ బాటిల్ ఇస్తుంది. కృష్ణ కి థాంక్స్ చెప్పి కాఫీ కావాలంటాడు మురారి. అలాగే అంటూ కాఫీ తేవటానికి వెళ్తుంది కృష్ణ. మురారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ముకుంద.
 

29

 కానీ కావాలనే అవాయిడ్ చేస్తాడు మురారి. బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద. ఈలోపు కృష్ణ కాఫీ తెచ్చి పరధ్యానంగా ఉన్న భర్తను చూసి ఏం జరిగింది ముకుంద ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. మురారి ఏమి సమాధానం చెప్పడు. డాబా మీదకి వెళ్ళిన ముకుంద కావాలనే మురారి నన్ను దూరం పెడుతున్నాడు కృష్ణకి దగ్గరవుతున్నాడు.

39

 నాన్న మురారితో మాట్లాడారో లేదో ఒకవేళ మాట్లాడితే కచ్చితంగా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడు అనుకుంటుంది. మరోవైపు కృష్ణ తన సీనియర్ కి బర్త్ డే విషెస్ చెప్తుంది. మరి నీ బర్త్ డే ఎప్పుడు అంటాడు మురారి. సెప్టెంబర్ 16 అదే రోజు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది అంటుంది కృష్ణ. ఏంటది అంటాడు మురారి. మన అగ్రిమెంట్ కి ఆఖరి రోజు అదే అంటుంది కృష్ణ. ఇద్దరూ ముభావంగా మారిపోతారు.
 

49

సీన్ కట్ చేస్తే ముకుంద  ఆనందంగా మురారి దగ్గరకు వచ్చి నువ్వు నాతో మాట్లాడతాను రమ్మని కబురు పెట్టావా అంటూ సంతోషిస్తుంది. అవును నేనే రమ్మన్నాను నీతో మాట్లాడాలి కార్లో కూర్చో అంటాడు మురారి. ఎక్కడికి అంటుంది ముకుంద. ఇల్లు కానప్పుడు ఎక్కడకి వెళ్తే ఏంటి కూర్చో అంటాడు మురారి. కార్లో కూర్చున్న ముకుంద మురారి ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడో అనుకుంటుంది. కారుని ఒక దగ్గర ఆపి కిందికి దిగుతాడు మురారి.

59

ముకుంద కూడా తన వెనకే వస్తుంది. మీ నాన్నకి ఏమని చెప్పావు అని అడుగుతాడు మురారి. మీరిద్దరూ మాట్లాడుకున్నారా అని అడుగుతుంది ముకుంద. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అసలు మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని మేము త్వరలో విడిపోతామని మీ నాన్నకు చెప్పవలసిన అవసరం ఏం వచ్చింది అంటూ నిలదీస్తాడు.

69

 నేనేమీ లేనిది చెప్పలేదు కదా త్వరలోనే నీ భార్య ప్లేస్ ఖాళీ అవుతుంది ఆ ప్లేస్ లోకి నేను వస్తాను తప్పేముంది అంటుంది ముకుంద. అలా అసభ్యంగా ఎలా ఆలోచిస్తున్నావు పరాయి ఆడదాని భర్తని పరాయి మగవాడి భార్యని కోరుకోవడం సభ్య సమాజం హర్షిస్తుందా అంటాడు మురారి. నాకు సమాజంతో పనిలేదు అంటుంది ముకుంద. అలా అయితే పెద్దమ్మతో చెప్పి మీ నాన్నగారి అభిప్రాయం కరెక్టే.

79

తనకి డైవర్స్ ఇప్పించి వాళ్ళు పుట్టింటికి పంపించేద్దామని చెప్తాను. అప్పుడు మీ నాన్న నీకు ఏది మంచో ఏది చెడో చెప్తాడు. ఒకవేళ ఇప్పుడు ఆదర్శ్ వచ్చినా నిన్ను ఏలుకోమని చెప్పటం వాడికి చేసిన అన్యాయమే అవుతుంది అంటాడు మురారి. నేను నీ ప్రేమను కోరుకుంటే నువ్వు నన్ను ఇంట్లోంచి పంపించేద్దామని చూస్తున్నావా ఇంత కసాయిగా ఎలా ఆలోచిస్తున్నావు.

89

ఒకవేళ అదే పరిస్థితి వస్తే నేను ప్రాణాలతో ఉండను ఒకవేళ ఉన్నా జీవచ్ఛవంలాగా బ్రతుకుతాను అంటూ ముందుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమెని చేయి పట్టుకుని తీసుకొచ్చి కార్లో కూర్చోబెడతాడు మురారి. కారులో వస్తున్నంతసేపు ముకుంద గురించి మురారి, మురారి గురించి ముకుంద ఆలోచిస్తూ ఉంటారు.

99

తరువాయి భాగంలో అగ్రిమెంట్ డేటు దగ్గర పడిపోతుంది ఒకవేళ ఎసిపి సార్ బయటకు వెళ్లిపోమంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని తండ్రి ఫోటో దగ్గర నుంచి అడుగుతుంది కృష్ణ. ఇంతలో మురారి వచ్చి నీలో నీ తింగరితనం  ఇష్టం నాలో నీకు ఏమి ఇష్టం అని అడుగుతాడు.

click me!

Recommended Stories