రంభ కూతురుని చూశారా?.. అచ్ఛ జూనియర్‌ రంభనే.. ఏం చేస్తుందో తెలుసా?

Published : May 24, 2023, 02:08 PM ISTUpdated : May 24, 2023, 02:10 PM IST

రంభ 90లో టాలీవుడ్‌ని ఊపేసిన నటి. గ్లామర్‌ డాల్‌గా రచ్చ చేసింది. నటనకు నటన, గ్లామర్‌కి గ్లామర్‌తో యువతని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యింది.   

PREV
15
రంభ కూతురుని చూశారా?.. అచ్ఛ జూనియర్‌ రంభనే.. ఏం చేస్తుందో తెలుసా?

రంభ.. 1992లో రాజేంద్రప్రసాద్‌ `ఆ ఒక్కటి అడక్కు` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. `ఏవండి ఆవిడ వచ్చింది`, `తొలి ముద్దు`, `రౌడీ అన్నయ్య`, `ముద్దుల ప్రియుడు`, `అల్లరి ప్రేమికుడు`, `అల్లుడా మజాకా`, `బొంబయి ప్రియుడు`, `ఖైదీ ఇన్‌స్పెక్టర్‌`, `హిట్లర్‌`, `గణేష్‌`, `బావగారు బాగున్నారా`, `కోదండ రాముడు` వంటి సినిమాల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, రాజశేఖర్‌,కృష్ణ వంటి హీరోలతో కలిసి నటించింది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

25

సినిమాలతోపాటు `ఐటెమ్‌ సాంగ్‌`లకు కూడా రంభ ఫేమస్‌ అయ్యింది. ఆమె `ఇద్దరు మిత్రులు`, `యమదొంగ`, `దేశముదురు`, `మృగరాజు`, `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` వంటి సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్‌లు చేసింది. తెలుగులోనే కాదు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసింది. అన్ని భాషల్లోనూ మెప్పించింది. కానీ తెలుగులోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

35

రంభ 2010లో కెనడాకి చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యింది. రంభకి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. సినిమాలకు దూరమైనా రంభ.. సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. అభిమానులను అలరిస్తూనే ఉంది. రంభ పెద్ద కూతురు లాన్య ఇంద్రకుమార్‌ ఫోటోలను తాజాగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది రంభ. అచ్చం తెలుగు అమ్మాయిలు, బొద్దుగా ఆకట్టుకునేలా ఉంది. చూడ్డానికి అచ్చు రంభలాగే ఉంది. 
 

45

దీంతో ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ జూ రంభ అంటున్నారు. అచ్చు జిరాక్స్ లాగానే ఉందని కామెంట్లు చేస్తుంది. మరికొందరు స్కూల్‌ డేస్‌ రంభలా ఉందంటున్నారు. అయితే ఇందులో ఆమె పాటలు పాడుతూ కనిపించింది. లాన్య సింగర్‌ అని కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎంతో క్యూట్‌గా, అందంగా ఉంది లాన్య. మరి భవిష్యత్‌లో హీరోయిన్‌ అవుతుందా? అనేది చూడాలి. 
 

55

రంభ తెలుగులో చివరగా `దొంగ సచ్చినోళ్లు` అనే చిత్రంలో నటించింది. 2008లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. ఇక పెళ్లైన తర్వాత రంభ తమిళంలో, కన్నడలో కొన్ని టీవీ డాన్సు షోలకు జడ్జ్ గా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ, వ్యక్తిగత వ్యాపారాలకే పరిమితమయ్యారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories