ఎపిసోడ్ ప్రారంభంలో బయట పని ఉంది వెళ్తాను అంటాడు మురారి. బయట పాన్ తిని చాలా రోజులైంది నేను కూడా వస్తాను అంటాడు ప్రసాద్. మేము కూడా వస్తాము అంటూ బయలుదేరుతారు అలేఖ్య, మధు. ఇంతమంది నా వెనుక వస్తే వెళ్ళిన పని అవ్వదు అనుకోని అప్పుడే ఫోన్ వచ్చిన వాడిలాగా చెవి దగ్గర పెట్టుకొని ఇప్పుడు రానక్కర్లేద రేపు కలవమంటారా అంటూ ఫోన్ పెట్టేస్తాడు మురారి.