‘ఆయన జీవితమే నాకు స్ఫూర్తి’.. లెజెండరీ చిత్రపటంతో ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ.. నభాలో ఈ టాలెంట్ కూడానా!

First Published | May 29, 2023, 1:33 PM IST

‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh) తాజా తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను రివీల్ చేసింది. ఆయన జీవితం తనకెంతో స్ఫూర్తిదాయకం అని చెప్పుకొచ్చింది.
 

యంగ్ హీరోయిన్ నభా నటేష్ ఇటీవల నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఈ సందర్భంగా వరుస  ఫొటోషూట్లతో దుమారం రేపుతోంది. అందాల విందు చేస్తూ అదరగొడుతోంది. ఈ క్రమంలోనే మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
 

అలాగే నభా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
 


తాజాగా నభా లెజెండరీ యాక్టర్, ప్రముఖ కమెడియన్ చార్లీ చాప్లిన్ (Charlie Chaplin) పెయింటింగ్ తో కనిపించింది. ఎంతో సంతోషంగా ఆయన చిత్ర పటంతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. అలాగే ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ కూడా ఇచ్చిందీ ముద్దుగుమ్మ.

ది లెజెండరీ చార్లీ చాప్లిన్ పెయింటింగ్‌ను పునఃసృష్టించాను. ఇది నా మొట్టమొదటి 4*4 కాన్వాస్. నటుడిగా, వ్యక్తిగా సర్ చార్లీ చాప్లిన్ జీవితం నుండి నేను ఎల్లప్పుడూ ప్రేరణ పొందుతూనే ఉంటాను. ప్రజల ముఖంలో చిరునవ్వు తీసుకురావడం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉత్తముడు. ఆ లెజెండ్ కు నా గౌరవం, నివాళి అర్పిస్తున్నాను.
 

ప్రతి ఒక్కరి జీవితంలో రోల్ మోడల్ ఎవరో ఒకరు ఉంటుంటారు. అలాగే నభా నటేష్ కు చార్లీ చాప్లిన్ అంటే గౌరవమని, ఆయన జీవితం తనకు ఇన్షిరేషన్ అంటూ చెప్పుకు రావడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు బ్యూటీఫుల్ గా చాప్లిన్ పెయింటింగ్ ను రీ క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు టాలెంట్ ను పొడుతున్నారు. 
 

కన్నడ బ్యూటీ నభా నటేష్ 2015లో వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులోకి ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత ‘అదుగో’ చిత్రంలోనూ నటించింది. ‘ఇస్మార్ట్ శంకర్’, ‘సోలో బ్రతుకే  సో బెటర్’ వంటి చిత్రాలతో హిట్లు అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేవని తెలుస్తోంది.

Latest Videos

click me!