ఎపిసోడ్ ప్రారంభంలో టైం అయింది త్వరగా రండి అని మురారిని పిలుస్తుంది కృష్ణ. వచ్చేస్తున్నాను అంటూ గబగబా రూమ్ లోకి వచ్చిన మురారి వాచ్ వైపు చూసి టైం అయిపోయింది నువ్వు ఫాస్ట్ గా వచ్చేయ్ ఈలోపు నేను కార్ తీసి పెడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సార్ మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని కేకలు వేస్తుంది కృష్ణ. ఎప్పుడు తిండి గోలేనా బయట తిందాంలే ఫాస్ట్గా వచ్చేయ్ అంటాడు మురారి.