వీధుల్లో తిరుగుతూ నేచురల్‌ అందంతో మృణాల్‌ ఠాకూర్‌ హల్‌చల్‌.. లూజ్‌ ఫ్రాక్‌లో రచ్చ.. గాలొస్తే కొంపకొల్లేరే

Published : Jun 17, 2023, 12:19 PM IST

`సీతారామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. నెమ్మదిగా టాలీవుడ్‌లో పాగా వేస్తుంది. సైలెంట్‌గా ఒక్కో ఆఫర్‌ దక్కించుకుంటూ దూసుకుపోతుంది.  ఈ బ్యూటీ ముంబయి వీధుల్లో హల్‌చల్‌ చేసింది.   

PREV
17
వీధుల్లో తిరుగుతూ నేచురల్‌ అందంతో మృణాల్‌ ఠాకూర్‌ హల్‌చల్‌.. లూజ్‌ ఫ్రాక్‌లో రచ్చ.. గాలొస్తే కొంపకొల్లేరే

మృణాల్‌ ఠాకూర్‌ వెండితెరపై ఒకలా, బయట మరోలా ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో విధ్వంసాన్ని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఈమేనా `సీతారామం`లో సీతగా చేసిందని ఆశ్చర్యపోతారు. అంతగా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ నెటిజన్లని తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడీ బ్యూటీ వీధుల్లో రచ్చ చేసింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. 
 

27

ముంబయిలో సందడి చేసింది మృణాల్‌.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కెమెరాలకు చక్కింది. ఇందులో కాజ్వల్ లుక్‌లో ఉంది మృణాల్‌. ఆమె పెద్దగా మేకప్‌ కూడా లేదు. సహజమైన అందంతో కనిపిస్తుంది. లూజ్‌ ఫ్రాక్‌ ధరించింది. ఓ వైపు గాలికి లెహంగా ఊగిపోతుంది. చిలిపి నవ్వులతో కవ్విస్తుందీ హాట్‌ బ్యూటీ. 
 

37

ఇందులో ఆమె నడుచుకుంటూ వస్తుండగా, అభిమానులు, కెమెరామెన్లు ఫోటోలకు వెంటపడ్డారు. వారికి నవ్వుతూ పోజులిచ్చింది. సైలెంట్‌గా వెళ్లపోయింది. అయితే ఇందులో ఆమె బాటమ్‌ సైడ్‌ ఫ్రాక్‌ ఓ వైపు కట్‌ చేసి ఉంది. దీంతో గాలికి ఊగిపోతుంది. గట్టిగా గాలొస్తే మాత్రం కొంపకొల్లేరే అని అంటున్నారు నెటిజన్లు. ఈ బ్యూటీపై కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. 
 

47

మృణాల్‌ ఠాకూర్‌ `సీతారామం`తో తెలుగు ఆడియెన్స్ లోనే కాదు ఇండియన్‌ ఆడియెన్స్ లో సీతగా ముద్ర వేసుకుంది. అంత బాగా ఆమె పాత్ర వెండితెరపై పండటం విశేషం. ఇందులో సెటిల్డ్ యాక్టింగ్‌తోనూ మెప్పించింది మృణాల్‌. ఓ వైపు ప్రిన్సెస్‌ నూర్జహాన్‌గా, మరోవైపు సీతాగా ఆమె రెండు భిన్న షేడ్స్ చూపించింది. ప్రేమ కోసం జీవితాన్నే త్యాగం చేసింది. ఫ్యామిలీని వదులుకుంది. ఆమె పాత్రలోని ఎమోషన్స్ ఆడియెన్స్ మదిలో మెదులాడుతూనే ఉంటాయి. అంత బాగా చేసిందని చెప్పొచ్చు. 
 

57

అందుకే తెలుగు ఆడియెన్స్ లో మృణాల్‌ సీతగా మిగిలిపోయింది. అయితే ఆ తర్వాత ఆమె సోషల్‌ మీడియాలో బోల్డ్ గా ఫోటో షూట్‌ చేసింది. అది చూసిన నెటిజన్లు షాక్‌ అయ్యారు. ఎక్కడ సీత, ఎక్కడి ఈ హాట్‌నెస్‌ అని ఆశ్చర్యపోయారు. దీంతో కొత్తలో దారుణంగా ట్రోల్స్ కి గురయ్యింది. అనంతరం తెలిసింది, స్వతహాగానే మృణాల్ లో ఆ బోల్డ్ నెస్‌,హాట్‌నెస్‌ ఉందని. దీంతో ఆ విషయాన్ని పట్టించుకోవడం తగ్గించారు. 

67

అయినా ఏమాత్రం తగ్గడం లేదు మృణాల్‌ అందాల ఆరబోతలో నెక్ట్స్ లెవల్‌ ప్రదర్శన చేస్తూనే ఉంది. ఓ వైపు అందంతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. మరోవైపు మేకర్స్ కి ఎరవేస్తుంది. సైలెంట్‌గా ఆఫర్లని దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నానితో `నాని30` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తాజాగా విజయ్‌ దేవరకొండతో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. వీడీ13లో హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యిందనే విషయం తెలిసిందే. 
 

77

తెలుగులో స్టార్‌ హీరోలకు మృణాల్‌ బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. అదే సమయంలో స్టార్‌ హీరోయిన్లకి రీప్లేస్‌గానూ మారుతుండటం విశేషం. మరోవైపు హిందీలోనూ నాలుగైదు ఆఫర్లతో బిజీగా ఉంది. ఇందులో `లస్ట్‌ స్టోరీస్‌ 2` కూడా ఉండటం విశేషం. ఇది వచ్చే వారం విడుదల కాబోతుంది. ఇందులో తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించబోతుంది మృణాల్‌. ఈ సినిమాలో తమన్నా, కాజోల్‌ వంటి వారు కూడా నటిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories