
ఎపిసోడ్ ప్రారంభంలో ఇప్పటివరకు నువ్వు ఏం చేసినా ఈ కుటుంబం మంచి కోసమే చేశావు కానీ నందిని విషయంలో పెద్దమ్మతో పంతానికి పోవద్దు అంటాడు మురారి. నందిని విషయంలో పెద్దత్తయ్యదే పంతం. నేను ఏమి చేసినా నందిని ఆరోగ్యం బాగు చేయటం కోసమే చేశాను. ఆ సీనియర్ డాక్టర్ని ఇంటికి పిలుస్తున్నాను. నందిని విషయంలో ఏం జరిగిందో ఎవరు ఏం చేశారు. అందరికీ అన్ని విషయాలు తెలిసేలాగా చేస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. గౌతమ్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది.నీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అంటాడు గౌతమ్. మీరు నా గురించి ఆలోచించకండి నేను చెప్పింది చెప్పినట్లుగా చెప్పండి చాలు అంటుంది కృష్ణ. నువ్వు చెప్పినట్లే చేస్తాను ఒకసారి పిరికితనంతో వెనక్కి వెళ్ళటం వల్ల నందినిని పిచ్చిదాన్ని చేశారు.
ఇప్పుడు కూడా డేర్ చేయకపోతే నందిని నాకు దక్కదు అంటూ నీ కాపురం జాగ్రత్త అని చెప్తాడు గౌతమ్. మరుసటి రోజు రేవతి దగ్గరికి వెళ్లి ఏమైనా స్పెషల్ వంటకాలు చేయమని అడుగుతుంది కృష్ణ. రెగ్యులర్ వంటకాలు బోర్ కొడుతున్నాయా అంటుంది రేవతి. నాకోసం కాదు ఒక స్పెషల్ గెస్ట్ లంచ్ కి వస్తున్నారు. నేను మీ మీద నమ్మకంతోనే ఆయన్ని లంచ్ కి పిలిచాను మీరు వద్దంటే మానేస్తాను అంటుంది కృష్ణ. అలాంటివేమీ పెట్టుకోకు నేను స్పెషల్ వంటకాలు చేస్తాను వాళ్లని రమ్మను అంటుంది రేవతి. ఇంతకీ ఆ వచ్చేది ఎవరు అని అడుగుతుంది. నందిని ప్రేమించిన సిద్దు అని చెప్తుంది కృష్ణ. అది విన్న రేవతి షాక్ అవుతుంది. నువ్వేమీ చెప్పలేదు నేనేమీ వినలేదు అసలు నాకు వంటలే రావు. నాకు గుండెల్లో దడ వచ్చేస్తుంది ఎక్కడ లేని గొడవలన్నీ నెత్తిన పెట్టుకొని ఇంట్లో దడ పుట్టిస్తున్నావు అని కంగారు పడిపోతుంది రేవతి.
మీరు భయపడుతున్నట్లు ఏమి జరగదు అంటుంది కృష్ణ. అలా అంటావేంటి నీకు ఇంకా మా అక్క గురించి తెలీదు నందిని ప్రేమించిన వాడిని ఇంటికి పిలిస్తే పైగా స్పెషల్స్ అన్ని చేసి పెడితే వచ్చిన వాళ్ళకి వండిన వాళ్ళకి పిలిచిన వాళ్ళకి మామూలుగా ఉండదు నీకు పుణ్యం ఉంటుంది అలాంటి పని చేయకు అంటూ చేతులు జోడిస్తుంది రేవతి. పెద్దతయ్య, ఈశ్వర్ మామయ్య, ప్రసాద్ మామయ్య నందిని ని ప్రేమించిన వాడి దగ్గర నుంచి దూరం చేసారు. గతాన్ని మర్చిపోవటానికి మందులు వాడి తనని ఇలాగా తయారు చేశారు. ఇదే కనుక కంటిన్యూ అయితే నందిని తలలో నరాలు చిట్లిపోయి చచ్చిపోతుంది అంటుంది కృష్ణ. అదేంటి తను ఈ ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్ల అలా జరగడానికి వీల్లేదు అంటుంది రేవతి. అందుకే మీరు నేను చెప్పినట్లుగా చేయండి. స్పెషల్ గెస్ట్ కోసం చేసినట్లు చేయండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అంటుంది కృష్ణ
అసలు ఏం జరిగింది అంటుంది రేవతి. జరిగిందంతా చెప్తుంది కృష్ణ. మా అక్కలో ఇంత పంతం ఉందా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది రేవతి. నందిని బాగు కోసం నా వల్ల అయింది నేను చేస్తాను కానీ నా పేరు బయటికి రాకూడదు అంటుంది రేవతి. మరోవైపు ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక పోలీస్ ఆఫీసర్ కూతుర్లాగా పరిస్థితులని ధైర్యంగా ఎదుర్కోవాలి అనుకుంటుంది కృష్ణ. స్నానం చేసిన వచ్చిన మురారి కృష్ణని తల తడవమంటాడు. తుడవను అనటంతో ఎదవ జీవితం అని తిట్టుకుంటాడు. నాగరికత ఎప్పుడు పుట్టిందో అప్పుడే మగవాడి కదా మొదలైంది తుమ్మినా తప్పే దగ్గినా తప్పే. హాస్యం మాట్లాడినా కూడా అపహస్యం వెతుకుని తప్పు పడుతున్నారు. పొరపాటున చెయ్యి పట్టుకున్నందుకు నా బ్రతుకు కుక్క బ్రతుకు అయిపోయింది అంటాడు మురారి.
మనది నిజమైన పెళ్లి కాదు అగ్రిమెంట్ మ్యారేజ్ మాత్రమే అంటుంది కృష్ణ.బొత్తిగా సెంటిమెంట్ లేకుండా పోతుంది మనుషులకి అంటాడు మురారి. మీరు చేసే నా మీదే ఎగురుతున్నారేంటి అంటుంది కృష్ణ. మీతో చాలా చెప్పాలనుకున్నాను కానీ చెప్పిన అర్థం చేసుకోలేరని అర్థమైంది అంటుంది కృష్ణ. గౌతమ్ సర్ ఇంటికి వస్తున్నారు మీరు రెడీ అయి కిందికి రండి అంటుంది. మన కాపురంలో నిప్పులు పోసిన మనిషి ఇంటికి వస్తున్నాడా అని మురారి అంటే నిప్పులు పోసే మనిషి కాదు నిప్పులాంటి మనిషి అంటుంది కృష్ణ. మీ సీనియర్ డాక్టర్ గౌతమ్ సారా ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటాడు మురారి. మీ పురుషహంకారాన్ని చూసి నా స్త్రీ అహంకారానికి మండింది అందుకే చెప్పలేదు అంటుంది కృష్ణ. మరోవైపు సుమ కొడుకు వచ్చి గుమ్మం ముందు నిల్చుంటాడు.
మీ ఆవిడ ఏది పుట్టింటిని వదిలి రానంటుందా అంటుంది భవాని. తనని కూడా తీసుకువచ్చాను అంటూ ఇద్దరూ వచ్చి భవాని ఆశీర్వచనం తీసుకుంటారు. అలేఖ్య మీ అమ్మ వాళ్లు బాగున్నారా అని అడుగుతుంది సుమ. ఇది వెళ్లిన వరకు బానే ఉన్నారు వెళ్ళాకే జుత్తులు పట్టుకోవడం ప్రారంభించారు అంటాడు సుమ కొడుకు. అన్ని వంటకాలు ఉన్నాయి నేను వస్తున్నాను అని తెలిసి ఏమైనా స్పెషల్ వంటలు చేశారా అని అడుగుతాడు.అంత లేదు గెస్ట్ లు ఎవరో వస్తారంట కృష్ణ చేయమంటే చేస్తున్నాము అంటుంది సుమ. గెస్టులు ఎవరు అని అడుగుతుంది రేవతి. సీనియర్ డాక్టర్ అంట అని చెప్పి తప్పించుకుంటుంది రేవతి.
మరోవైపు కిందికి వచ్చిన కృష్ణ లంచ్ కి, నందిని విషయానికి ఏమైనా సంబంధం ఉంది అనుకుంటున్నారా అని అడుగుతుంది.అసలు వదిన ఆ ప్రస్తావన తీసుకురాలేదు కదా ఇప్పుడు నందిని విషయం ఎందుకు అంటాడు ఈశ్వర్. ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం అందుకే మా రహస్య సంకేతాలు మాకే బాగా అర్థమవుతాయి అంటుంది కృష్ణ.నందినికి వేసిన టాబ్లెట్స్ కావాలనే వేశానని నన్ను బ్లెయిమ్ చేయటంలో బాగానే సక్సెస్ అయింది అంటుంది కృష్ణ.తరువాయి భాగంలో నందిని విషయంలో నా తప్పేమీ లేదు అని రుజువు చేసుకోవడానికి మా సీనియర్ డాక్టర్ని రమ్మన్నాను అంటుంది కృష్ణ. అంతలోనే ఇంటికి వచ్చిన గౌతమ్ ని లోపలికి తీసుకొస్తుంది కృష్ణ.