జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణు ఎల్దండి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే దర్శకుడిగా మారాడు. వేణు డెబ్యూ దర్శకుడిగా తెరకెక్కించిన బలగం చిత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఘనవిజయం సాధించింది. వేణు దర్శకత్వ ప్రతిభకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు.