చెప్పులు తీసుకొని గది బయటికి వస్తున్న రాజ్ ని చూసి కుటుంబ సభ్యులందరూ చూసి షాక్ అవుతారు. రాజ్ కూడా అందర్నీ చూసి తల ఒంచుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అపర్ణ ఆపి తలదించుకునే పని ఏమైనా చేసావా అని అడుగుతుంది. నో, నో అంటూ కంగారుగా చెప్తాడు రాజ్. ఈ శ్రీకృష్ణ లీలలు ఏమిటి అని మనవడిని కొంటెగా అడుగుతుంది చిట్టి.నీ గదిని అంత అందంగా అలంకరిస్తే శోభనమే వద్దు అన్నవాడివి తెల్లారేసరికి ఈ గది నుంచి బయటకు వస్తున్నావేంటి, నీకు ఇదేం కర్మ పెట్టింది దివ్యమైన గది ఉండగా అంటుంది చిట్టి.