Chiranjeevi: నాకు కులపిచ్చి ఉంటే చిరంజీవి మెగాస్టార్‌ అయ్యేవాడు కాదు.. సీనియర్‌ హీరో సంచలన వ్యాఖ్యలు

Published : Oct 14, 2026, 08:50 AM IST

ఇండస్ట్రీలోగానీ, నాకు గానీ కుల పిచ్చి ఉంటే ఇప్పుడు చిరంజీవి ఇంతటి మెగాస్టార్‌ అయ్యేవాడు కాదని చెప్పారు సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌. ఈ సందర్భంగా షాకింగ్‌ విషయాలను వెల్లడించారు.

PREV
15
టాలీవుడ్‌లో కులం ప్రస్తావన

తెలుగు చిత్ర పరిశ్రమలో కుల ప్రస్తావన తరచూ వస్తుంటుంది. కులం చుట్టూనే సినిమా తిరుగుతుందంటుంటారు. కమ్మ, కాపులదే రాజ్యం అనే ప్రచారం చాలా కాలంగా ఉంది. వీరి మధ్య ఎక్కువగా పోటీ ఉంటుందని చెబుతుంటారు. ఈ రెండు కులాలకు చెందిన వాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారని, వీళ్లకి వాళ్లకి పడదు అంటుంటారు. కానీ వాస్తవంగా అలా కనిపించడం చాలా తక్కువ. ఎందుకంటే ఈ రెండు కులాలకు చెందిన హీరోలు కలిసే ఉంటారు. స్నేహాన్ని కొనసాగిస్తారు. చిరంజీవితో ఇతర కులాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు సినిమాలు చేశారు. ఆయన మెగాస్టార్‌ కావడంలో టాలెంట్‌దే ముఖ్య స్థానం తప్పితే కులం అనేది మ్యాటర్‌ కాదనేది నిజం.

25
మద్రాస్‌లో కుల గజ్జి ఉండేది కాదు.. హైదరాబాద్‌ వచ్చాకే

సీనియర్‌ నటుడు, ఒకప్పుడు హీరోగా మెప్పించిన మురళీమోహన్‌ దీనిపై స్పందించారు. ఇండస్ట్రీలో కుల గజ్జి ఎక్కువగా ఉంటుందనే ప్రశ్నకి ఆయన రియాక్ట్ అవుతూ.. మద్రాస్‌లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఈ గొడవ లేదన్నారు. అక్కడ తెలుగు వాళ్లు అనేదే మెయిన్‌గా ఉండేదన్నారు. మనవాడు అని మాట్లాడుకున్నారే గానీ ఏ రోజు కూడా నీది ఏ కులం అని అడిగేవాళ్లు కాదు, అసలు ఆ ప్రస్తావనే ఉండేది కాదు, కానీ హైదరాబాద్‌కి ఇండస్ట్రీ వచ్చాక ఈ కులం అనేది చర్చనీయాంశంగా మారుతూ వచ్చింది. ఇక్కడి రాజకీయాలు అందుకు మెయిన్‌ కారణమని తెలిపారు మురళీ మోహన్‌. ఒక్కటే రాష్ట్రం కావడంతో మీది ఏ కులం అనేది చర్చకు వచ్చిందని తెలిపారు.

35
నాకు కుల పిచ్చి ఉంటే చిరంజీవి మెగాస్టార్‌ అయ్యేవారా?

అయితే అప్పట్లో ఎవరూ ఈ కులం అనేది పట్టించుకోలేదని తెలిపారు. అలా అయితే ఇండస్ట్రీలో ప్రారంభంలో ఎక్కువగా చౌదరీలో ఉన్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, ఎస్వీఆర్‌ ఇలా అంతా ఒక్కటే కులానికి చెందినవాళ్లు. అదే సమయంలో మేం కూడా చౌదరీలమే. ఆ సమయంలో చౌదరీలే నిర్మాతలు, దర్శకులుగా ఉన్నారు. వాళ్లు మా కులం వాడితోనే సినిమాలు చేయాలనుకుంటే చిరంజీవితో మూవీస్‌ చేసేవారు కాదు, నేను మా కులం వాళ్లతోనే చేయాలని నిర్మాతలను, దర్శకులకు చెప్పినా చిరంజీవితో సినిమాలు చేసేవారు కాదు, ఆయన ఇప్పుడు ఈ స్థాయికి(మెగాస్టార్‌) రేంజ్‌కి వచ్చేవారా? కానీ అలా ఎప్పుడూ జరగలేదు.

45
టాలెంట్‌కే పెద్ద పీఠ.. ఆ తర్వాతే కులం

ఎవ్వరైనా టాలెంట్‌ని చూశారు, మార్కెట్‌ని చూశారు, చిరంజీవితో సినిమా చేస్తే బాగా ఆడుతుందని, ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని సినిమాలు చేశారు తప్పితే, కులం గురించి ఆలోచించ లేదు. ఇప్పుడు ఆ కులం గురించి ఏదో అంటుంటారు కానీ, అప్పుడు మాత్రం ఆ గొడవ లేదు. కళకి కులంతో, ప్రాంతంతో సంబంధం లేదు. ఇతర భాషల చిత్రాలను మనం చూస్తున్నాం. మన సినిమాలు వాళ్లు చూస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీలో కుల గజ్జి ఉందనేది నేను నమ్మను. అయితే అది కొంత పరిధి వరకే పరిమితమని తెలిపారు మురళీ మోహన్‌. సీనియర్‌ జర్నలిస్ట్ నాగేంద్రకుమార్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

55
కాకాతో రాబోతున్న చిరంజీవి

మెగాస్టార్‌ చివరగా ఆయన ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో `కాకా` సినిమా చేస్తున్నారు. `వాల్తేర్‌ వీరయ్య` తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. వచ్చే సంక్రాంతికి కూడా బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలని చూస్తున్నారు చిరంజీవి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories