రెండు సార్లు పేర్లు మార్చుకున్న మురళీ మోహన్.. అసలు ఆయన రియల్ నేమ్ ఏంటో తెలుసా?

Published : Apr 06, 2024, 07:31 AM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు, బిజినెస్ మెన్ మురళీ మోహన్ (Murali Mohan) రెండు సార్లు పేర్లు మార్చుకున్నారు. ఇంతకీ ఆయన అసలు పేరు ఏంటీ? ఎందుకు పేరు మార్చుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.

PREV
16
రెండు సార్లు పేర్లు మార్చుకున్న మురళీ మోహన్.. అసలు ఆయన రియల్ నేమ్ ఏంటో తెలుసా?

ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం కోసం పలు కారణాలతో సెలబ్రెటీలు తమ పేర్లు మార్చుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి, రజినీకాంత్ తదితరుల రియల్స్, స్క్రీన్ నేమ్ వేరనే విషయం తెలిసిందే.

26

ఇక సీనియర్ నటుడు, రియల్టర్ మాగంటి మురళీ మోహన్ (Murali Mohan) తెలుగు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అప్పటి ప్రేక్షకుల్లో ఈయనను అభిమానించే వారి సంఖ్య ఎక్కువని తెలిసిందే. 

36

నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, రియల్టర్ గా మంచి గుర్తింపు తెచ్చకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా కీర్తి పొందారు. ఇక ఆయన 350కి పైగా సినిమాల్లో నటించారు. 

46

అయితే ఆయన సక్సెస్ వెనకాల కూడా ఓ సీక్రెట్ ఉందని తెలుస్తోంది. జీవితంలో ఉన్న స్థానాలకు వెళ్లాలనే ఆశేమీ కాదుకని... కొన్ని సందర్భాలతో పేరు మార్చుకోవాల్సి వచ్చిందని ఆయనే రీసెంట్ గా తెలిపారు.

56

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ’మొదట నా తండ్రి రాజారామ్మోహన్ రాయ్ అని పేరుపెట్టారు. ఆయనకి స్వాంతంత్ర్య సమరయోధులంటే ఇష్టం. అందుకని నాకు ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు వచ్చేలా నామకరణం చేశారు. 

66

కానీ ఆ తర్వాత స్కూల్లో ఇబ్బందిగా ఉంటుందని ‘రాజబాబు’గా మార్చుకున్నానను. ఇక సినిమాల్లోకి వచ్చాక రెండోసారి ‘మురళీమోహన్ గా‘ పేరు మార్చుకున్నానని చెప్పారు.

click me!

Recommended Stories