సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ వేలంలో ఎంతకు అమ్ముడైందో తెలుసా.?

Published : Oct 26, 2025, 05:00 PM IST

Silk Smitha: 80వ దశకంలో హీరోయిన్ సిల్క్ స్మిత టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోయిన్ల రేంజులో రెమ్యునరేషన్ అందుకుంది. అయితే సిల్క్ స్మిత గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం..! ఆ వివరాలు ఈ వార్తలో చూసేద్దాం.

PREV
15
అగ్రనటీమణులలో ఒకరు..

సిల్క్ స్మిత్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 80వ దశకంలో ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోయిన్ల రేంజులో రెమ్యునరేషన్ అందుకుంది. అంతేకాదు అప్పటి హీరోలకు సిల్క్ స్మిత సినిమాలో ఉంటే.. అది హిట్ అని అనుకునేవారు. అద్భుతమైన అందచందాలతో, మత్తెక్కించే చూపులతో, మైమరిపించే నాట్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన తార సిల్క్ స్మిత.

25
దర్శకనిర్మాతలు డేట్స్ కోసం..

ఆ సమయంలో సిల్క్ స్మిత క్రేజ్ మాములుగా లేదు. దర్శక నిర్మాతలు ఆమె డేట్ల కోసం ఎంతగానో ఎదురుచూసేవారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిల్క్ స్మిత.. కృష్ణంరాజు, సుమన్, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ వంటి అగ్ర నటులతో కలిసి నటించింది.

35
కష్టాలు అనుభవించింది..

కెరీర్ స్టార్టింగ్‌లో సిల్క్ స్మిత కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ.. ఆపై స్టార్ హీరోయిన్లకు సాటిగా సినిమాలు చేసింది. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంది. అందం, అభినయంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. అయితే చనిపోయే రోజుల్లో కూడా తీవ్ర కష్టాలు పడింది. ఆమె చనిపోయినప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ తప్పితే.. మరే హీరో చివరిచూపుకు వెళ్లలేదని సమాచారం.

45
ఆసక్తికర విషయాలు మీకోసం..

సిల్క్ స్మిత గురించి ఓ ఆసక్తికర విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1984లో ఒక సినిమా షూటింగ్ విరామ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సిల్క్ స్మిత ఒక ఆపిల్ పండు తింటుండగా.. షాట్ రెడీ అని డైరెక్టర్ పిలుపు వచ్చింది. దీంతో ఆమె సగం కొరికిన ఆపిల్‌ను అక్కడే వదిలి షూటింగ్‌కు వెళ్ళిపోయింది.

55
వేలంలో ఎంతకు అమ్ముడైందో తెలుసా.?

ఇక ఆ సగం కొరికిన ఆపిల్‌ను ఆమె మేకప్‌మెన్ అక్కడికక్కడే వేలం వేయాలని నిర్ణయించాడు. సెట్‌లో ఉన్నవారు పోటీపడి మరీ ఆ ఆపిల్‌ను రూ. 26 వేలకు కొనుగోలు చేశారు. ఈ సంఘటన సిల్క్ స్మిత పట్ల అప్పట్లో ఉన్న విపరీతమైన అభిమానాన్ని, ఆమెకు ఉన్న స్టార్‌డమ్‌ను తెలియజేస్తుందని చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories