ఎలా అయినా ఈరోజు గుడిలో ఉంగరం తొడగాలి అని డిసైడ్ అవుతుంది. మరోవైపు భవాని గదికి వెళ్తాడు మురారి. ఎందుకు పెద్దమ్మ రమ్మన్నావంట అని అడుగుతాడు. నేను ఆశ్రమానికి వెళ్తున్నాను అంటుంది భవాని. ఎందుకు అని కంగారుగా అడుగుతాడు మురారి. జీవితం మీద విరక్తి పుట్టి నా శేష జీవితాన్ని అక్కడే గడపటానికి మాత్రం కాదు అంటూ నవ్వుతుంది భవాని.