Krishna Mukunda Murari: అసూయతో రగిలిపోతున్న ముకుంద.. బొకేతో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చిన భవాని?

Published : May 11, 2023, 01:52 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్  ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటూ మంచి రేటింగుని సంపాదించుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తికి పెళ్లి అయినా సరే అతని కోసం పరితపిస్తున్న ఒక స్త్రీ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Krishna Mukunda Murari: అసూయతో రగిలిపోతున్న ముకుంద.. బొకేతో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చిన భవాని?

 ఎపిసోడ్ ప్రారంభంలో నిద్రలో ఉన్న మురారి కి ముకుంద అన్న మాటలు గుర్తుకు వచ్చి టెన్షన్ తో నిద్ర లేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ టైం అవుతుంది వెళ్లి ఫ్రెష్ అవ్వండి కేక్ కట్ చేద్దురుగాని అంటుంది. ఫోన్ లో ఏదో మెసేజ్ పెట్టి  వాష్ రూమ్ కి వెళ్తాడు మురారి. వాళ్ళ పెద్దమ్మ తనతో మాట్లాడలేనందుకు ఫీలవుతున్నాడు అనుకుంటుంది కృష్ణ.

28

ఎలాగైనా ఆ తల్లి కొడుకుల మధ్య అపార్ధాలు తొలగిపోయేలాగా చూడాలి అంటూ తండ్రి ఫోటో చూస్తూ అనుకుంటుంది. మరోవైపు మురారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ముకుంద. భయపడుతూనే అక్కడికి వస్తాడు మురారి. ఇదంతా అవసరమా పెద్దమ్మ వాళ్ళు చూస్తే  బాగోదు అంటాడు. అవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు కేకు కట్ చేయు అంటూ అతనితో కేక్ కట్ చేస్తుంది ముకుంద.

38

 తర్వాత మురారి వేలికి ఉంగరం తొడిగి బర్త్డే విషెస్ చెప్తుంది. ఈ ఉంగరం నీకు తొడిగేసాను అంటే మనకి ఎంగేజ్మెంట్ అయిపోయినట్లే అంటూ ఆనందపడుతుంది. అంతలోనే స్పృహలోంచి బయటికి వచ్చిన ముకుంద తను బ్రమలో ఉన్నానని తెలుసుకుంటుంది. ఏదో మెసేజ్ రావటంతో ఫోన్ చూస్తుంది. నేను రావటం లేదు దయచేసి అర్థం చేసుకో అంటూ మురారి పంపించిన మెసేజ్ అది.
 

48

మెసేజ్ చూసిన ముకుంద కన్నీరు పెట్టుకుంటుంది ఎప్పుడూ నేను నిన్ను అర్థం చేసుకోవటమేనా నువ్వు నన్ను అర్థం చేసుకునేది ఉండదా అంటూ బాధపడుతుంది. మరోవైపు మురారి చేత కేక్ కట్ చేయిస్తుంది కృష్ణ. తన రూమ్ కి వెళ్ళబోతున్న ముకుంద అది చూసి ఆగిపోతుంది. ముకుందని గమనించిన మురారి డల్ గా అయిపోతాడు. కృష్ణ మురారి చేతిలో కేక్ తీసుకొని అతనికి తినిపించి హ్యాపీ బర్త్డే చెప్తుంది.

58

  ఇదంతా చూస్తున్న ముకుంద ఏడుస్తూ తన గదికి వెళ్ళిపోతుంది రేపు ఎలాగైనా ఈ ఉంగరం నీ వేలికి  తొడగాలి లేదంటే నా ప్రేమకి అర్థం ఉండదు అనుకుంటుంది. మరోవైపుకు మురారికి బర్త్డే విషెస్ చెప్పలేనందుకు బాధపడుతుంది భవాని. మెల్లగా అతని రూమ్ దగ్గరికి వస్తుంది. పడుకున్న మురారిని ప్రేమగా చూసుకుంటుంది. మురారి అప్పుడే నిద్రలో నన్ను క్షమించు పెద్దమ్మ.. నాతో మాట్లాడు పెద్దమ్మ అని మాట్లాడుతూ ఉంటాడు.
 

68

 ఆ మాటలు విన్న భవాని కన్నీరు పెట్టుకుంటుంది. మనసులోనే బర్త్డే విషెస్ చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మరోవైపు ముకుంద ఆలోచనలో ఉంటుంది. కృష్ణ మురారి ఆనందంగా గడిపిన సమయాన్ని తలుచుకొని అసూయతో రగిలిపోతుంది. చితిని కాల్చడానికి చిన్న నిప్పు చాలు అలాగే హృదయాన్ని కాల్చడానికి ప్రేమించిన వాడి నిర్లక్ష్యం చాలు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

78

నేను నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వు నాకు దూరం అవ్వాలని చూస్తున్నావు ఏది ఏమైనాప్పటికీ నువ్వు బాగా మారిపోయావు అది నీలో వచ్చిన మార్పు లేకపోతే కృష్ణ నీలో తీసుకువచ్చిన మార్పో అర్థం కావడం లేదు అనుకుంటుంది. నీ కుటుంబం కోసం నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేశావు నా ప్రేమ కోసం నేను ఏం చేయాలనుకుంటున్నాను అది చేస్తాను.నా ప్రేమని ఎట్టి పరిస్థితుల్లోని దక్కించుకొని తీరుతాను ఇది కత్తి దూయని యుద్ధం.. కక్ష తీర్చుకోలేని శత్రుత్వం.
 

88

ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా ప్రేమని దక్కించుకుంటాను అంటూ శపధం చేస్తుంది ముకుంద. తరువాయి భాగంలో కేక్ కట్ చేయడం కోసం అంతా సిద్ధం చేస్తుంది కృష్ణ. మీ పెద్దమ్మ లేకుండా ఎప్పుడు కేక్ కట్ చేయలేదు కదా అని బాధగా ఉంటుంది రేవతి.పెద్దతయ్య తప్పకుండా వస్తాను అని చెప్పారు అంటుంది కృష్ణ. నీకు చెప్పారా అంటాడు మురారి. అంతలోనే బొకే తీసుకొని కిందికి దిగుతున్న భవానీని చూసి అందరూ ఆశ్చర్యపోతారు.

click me!

Recommended Stories