ఆర్ యు ఓకే అంటాడు. పట్టుకోడానికి మీరు ఉన్నారు కదా అంటుంది కృష్ణ. అస్తమానం నీ పక్కన నేను ఉండను కదా కాస్త జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావ్ అంటూ నవ్వుతాడు మురారి. మీరు డాబా మీదకి వెళ్ళండి నేను కాఫీ తీసుకొని వస్తాను అంటుంది కృష్ణ. మురారి, ముకుందని చూస్తాడు. ముకుంద చాలా బాధగా మురారి వైపు చూస్తుంది.