The Kerala Story Movie Review
కొన్ని చిత్రాలు రిలీజ్ కు ముందు నుంచి అందులో కంటెంట్ ని బట్టి వివాదం రేపుతూ ఉంటాయి. అలాంటి చిత్రమే ది కేరళ స్టోరీ. ఆ మధ్యన వచ్చిన ది కాశ్మీర్ ఫైర్స్. ఈ సినిమా ట్రైలర్ రిలీజైన నాటి నుంచే దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేగుతోంది. కేరళ సీఎంతో సహా రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సినిమాపై మండిపడ్డారు. టీజర్, ట్రైలర్ విడుదలైన వెంటనే ఈ సినిమాను నిలిపివేయాలని , విడుదల చేయకూడదని కోరుతూ కేరళ హై కోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సినిమా విడుదలను ఆపేందుకు ప్రయత్నించారు. అయినా కుదరలేదు. ఆందోళనలు, నిరసనల మధ్యనే ది కేరళ స్టోరీ ఈ వారం విడుదలైంది. కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తీశామని చెప్పుకుంటూ తెరకెక్కించిన సినిమా ఎలా ఉంది. అసలు ఈ సినిమాలో ఏముంది..కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
the kerala story shows cancelled by some theatres in kerala nsn
స్టోరీ లైన్
యూఎన్ డిటెన్షన్ సెంటర్ లో గాయపడిన అదాశర్మ సన్నివేశంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. విచారణ సమయంలో ఆమె శిక్షణ పొంది ఐసిస్ ఉగ్రవాదిగా ఎలా మారింది అనే విషయాలను గుర్తు చేసుకుంటుంది. ఫాతీమా బా గా మారిన షాలిని అఫ్ఘనిస్థాన్‌లో ఎదురైన చేదు అనుభవాలను తన ఇద్దరు స్నేహితులు నిమా, గీతాంజలికి చెప్పడం ద్వారా ఫ్లాష్ బ్యాక్‌లో కథ సాగుతుంది. కేరళలోని కాసర్గాడ్‌లోని నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ (అదా శర్మ) చేరుతుంది. అక్కడ నిమా (యోగితా భిహాని), గీతాంజలి (సిద్ది ఇద్నానీ) పరిచయం అవుతారు. అసీఫా (సోనియా బలానీ)తో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకొంటారు. ఇక అసీఫా ఐసీస్ (ISIS)లో అండర్ కవర్‌గా పనిచేస్తూంటుంది. ఆమె టార్గెట్ అమ్మాయిలు. వాళ్లకు అవీ,ఇవీ మాయ మాటలు చెప్పి బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తూంటుంది.
The Kerala Story
అందులో భాగంగా ఇద్దరు ముస్లిం అబ్బాయిలను రంగంలోకి దించి గీతాంజలి, షాలినితో లవ్ జిహాద్ ఉచ్చులోకి దించే పోగ్రామ్ మొదలెడుతుంది. ఈ క్రమంలో రమీజ్ అనే అబ్బాయి ప్రేమలో పడిన షాలిని గర్బవతి అవుతుంది. పెళ్లి చేసుకోమని రమీజ్‌ను అడిగితే ఇస్లాం మతంలోకి మారితే వివాహం చేసుకొంటానని చెబుతాడు. దాంతో వేరే దారి లేక రమీజ్‌ను పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మారి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అఫ్ఘనిస్థాన్‌లో అరెస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ది కేరళ స్టోరీ సినిమా.
The Kerala story
ఎలా ఉంది..
ఈ సినిమా ప్రధానంగా .. ఇతర మత అమ్మాయిలను లవ్ జీహాద్ పేరుతో ఇస్లాం మతంలోకి మార్చడానికి లాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? కేరళలోని లవ్ జీహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రాడికలైజేషన్, ఐసిస్ రిక్రూట్ మెంట్ వంటి సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. కథలో ప్రధాన పాత్ర అయిన అసీఫా ఉచ్చులో షాలిని ఎలా పడింది. పెళ్లి కాకుండా గర్బవతి అయిన షాలిని ఎలాంటి మానసిక సంఘర్షణకు గురైంది? ఇస్లాం మతంలోకి మారాలని ప్రియుడు కండిషన్ పెట్టిన సమయంలో షాలిని పడిన మానసిక సంఘర్షణ ఏమిటి? వంటి అంశాలు చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే అఫ్ఘనిస్థాన్‌లో అరెస్ట్ అయిన తర్వాత షాలిని అలియాస్ ఫాతీమా బా ఎదుర్కొన్న సమస్యలు ని చాలా బాధాకరంగా చూపెట్టారు. లవ్-జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, బోధనల వల్ల ముగ్గురు మహిళలు ఎదుర్కొన్న దయనీయ పరిస్థితులను ఈ సినిమాలో చూపించటమే ఈ కథ ప్రధాన లక్ష్యంగా సాగుతుంది
The Kerala story
.ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే బోర్ కొట్టకుండా తీసుకువెళ్లకపోతే విసుగు వచ్చేస్తుంది. ఆ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డారు. సినిమాని ఫ్లాష్ బ్యాక్, ప్రస్తుత సన్నివేశాల మధ్య బ్యాలెన్స్ చేయటం బాగుంది.సినిమాలో హిందూ మతపరమైన ఆరాధన, నాస్తికత్వం, కమ్యునిజం, ఇస్లాం, షరియా చట్టాలను బోధించే ప్రక్రియలను చూపించటం కత్తి మీద సామే. దర్శకుడు చాలా బ్యాలెన్డ్స్ గా చేసారనే చెప్పాలి. అయితే కొన్ని సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ట్రాప్ చేసేసీన్స్ కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది. బాగా ఎక్కువ సేపు లాగినట్లు అనిపించింది. ఒక సీన్ లో - షాలిని గర్భవతి అని తెలుస్తుంది. మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెబుతాడు ప్రియుడు. మతం మార్చుకోవడానికి ఆమె సిద్ధమవుతుంది. పెళ్లికి సిద్ధపడుతున్న సమయంలో ప్రియుడు పరారైపోతాడు. అప్పుడు ఓ మత పెద్ద.. నువ్వు మరో ఇస్లాం యువకుడిని పెళ్లి చేసుకొని సిరియా వెళ్ళిపోతే 'మా దేవుడు నీ తప్పులన్నీ మాఫీ చేస్తాడు' అని చెప్తాడు. ఇలాంటివి చూసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తాయి.
The Kerala story
టెక్నికల్ గా ...
డైరక్టర్ సుదీప్తోసేన్ సినిమా టెక్ గా కొన్ని సన్నివేశాలు ఉన్నా, చాలా భాగం వాస్తవికతను ఉట్టిపడేలా చిత్రాన్ని మలిచారు. సంజయ్ శర్మ ఎడిటింగ్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్, కలర్ బ్యాలెన్స్ కూడా ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
The Kerala story
నటీనటుల్లో ...
షాలినిగా ఫాతీమాగా రెండు వేరియేషన్స్ ఉన్న అమ్మాయి పాత్రలో అదా శర్మ ఎక్కడా వంక పెట్టలేనివిధంగా నటించింది. చాలా చోట్ల చూసేవారిని ఎమోషన్ కు గురి చేస్తుంది.
యోగితా, సోనియా, సిద్ధి సైతం చక్కటి పర్ ఫార్మెన్స్ కనబరిచారు.
The Kerala story
ఫైనల్ థాట్
భావజాల ప్రధానమైన సినిమా అయినా తీసిన విధానం,కథను చెప్పే పద్దతి హత్తుకునేటట్లుంది. అయితే ఆ భావజాలానికి కనెక్ట్ అయితేనే సినిమా నచ్చుతుంది.
Rating:2.5
Actress Adah Sharma revealed the authenticity of the film The Kerala Story
బ్యానర్: సన్‌షైన్ పిక్చర్స్
నటీనటులు: అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ప్రణయ్ పచౌరీ, ప్రణవ్ మిశ్రా తదితరులు
దర్శకత్వం: సుదిప్టో సేన్
రచన: సూర్యపాల్ సింగ్
నిర్మాత: విపుల్ అమృత్ లాల్ షా
ఎడిటింగ్: సంజయ్ శర్మ
మ్యూజిక్: విరేష్ శ్రీవాల్స, బిషఖ్ జ్యోతి
రిలీజ్ డేట్: 2023-05-05