మొన్న సమంత.. ఇప్పుడు రకుల్ ప్రీత్.. బికినీలో మంచునే కరిగిస్తున్న ‘ఢిల్లీ’ భామ.. వైరల్

First Published | May 6, 2023, 1:22 PM IST

ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పంచుకున్న పోస్ట్ వైరల్ గా మారింది. ఏకంగా బికినీలో ఐస్ బాత్ చేస్తూ దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 
 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 
 

కొన్నాళ్లుగా సౌత్ ఆడియెన్స్ కు దూరంగా  ఉన్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ మెరియబోతోంది. ఈ సందర్భంగా నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. ఇక తాజాగా బికినీలో రకుల్ ఐస్ బాత్ (Ice Bath) చేస్తూ దర్శనమిచ్చింది. 
 


బ్లూ బికినీలో గడ్డకట్టిన మంచు మధ్యలో ఐస్ బాత్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంది. - 15 డిగ్రీల వాతావరణంలో ఎవరైనా ఇలా ట్రై చేస్తారా? అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 
 

అయితే, మొన్ననే సమంత కూడా ఇదే తరహాలో కనిపించింది.  టార్చర్ టైమ్ అంటూ.. ఐస్ గడ్డల బ్యాగ్ లో కూర్చొంది. ఐస్ బాత్ కు సంబంధించిన థెరపీని పొందుతున్నారని తెలుస్తోంది. సమంత తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఇలా దర్శనమివ్వడం నెట్టింట వైరల్ గా మారింది. 

సమంత, రకుల్ తరుచూ వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంటారు. స్లిమ్ ఫిట్ గా కనిపించేందుకు హెవీగాజిమ్ లో వర్కౌట్స్ చేస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా మజిల్స్ టైట్ అవ్వడం, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇలా ఐస్ బాత్ చేయడం వల్ల కాస్తా రిలీఫ్ దక్కుతుంది. 
 

మొన్నటి వరకు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై ఫోకస్ పెడుతోంది.  తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇండియన్ 2తో పాటు ‘ఆయలాన్’లో నటిస్తోంది.

Latest Videos

click me!