ఇంతలోనే మురారి ఫ్రెండ్ గోపి రావడంతో కరెక్టు టైం కి ఎంట్రీ ఇచ్చాడు అని మురారి, కృష్ణ ఇద్దరు తిట్టుకుంటారు. రాంగ్ టైం లో ఎంట్రీ ఇచ్చానని గోపి కూడా అర్థం చేసుకుంటాడు. కృష్ణ హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్తుంది. నేను రాంగ్ టైం లో ఎంత ఇచ్చాను అని తెలుసు మరీ అంత కోపంగా చూడకు కావాలంటే వెళ్ళిపోతాను అంటాడు గోపి. నా ప్లాన్ అంతా నాశనం చేసావు ఇంకెందుకు వెళ్లిపోవడం అంటాడు మురారి. అదే సమయానికి ముకుంద కూడా వస్తుంది.